Home » మా చేతిలో లేదు.. ప్రభుత్వం చేతిలో ఉంది..!

మా చేతిలో లేదు.. ప్రభుత్వం చేతిలో ఉంది..!

by Azhar
Ad

ఇండియా, పాకిస్థాన్ మధ్య ఈ ఆదివారం రోజున ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా వేదికగా మాస్క్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఇండియా, పాక్ మధ్య మ్యాచ్ అంటే అందరి చూపు అటు వైపే ఉండాలి. కానీ ప్రస్తుతం ఈ రెండు దేశాల ప్రజల చూపు అనేది జట్ల పైన కాకుండా దేశ క్రికెట్ బోర్డు పైన ఉన్నది. అందుకు కారణం బీసీసీఐ సెక్రెటరీ జై షా చేసిన కామెంట్స్.

Advertisement

వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఆసియా కప్ టోర్నీలో ఇండియా జట్టు పాల్గొనదు అని చెప్పారు. టోర్నీని మరో వేదికకు మారుస్తేనే మేము పాల్గొంటాం అని పేర్కొన్నాడు. ఇక ఇదే విషయం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు, మాజీలకు, ఫ్యాన్స్ కు ఎవరికీ నచ్చలేదు. అందువల్ల ఇప్పుడు ఈ విషయం పై పెద్ద చర్చ అనేది జరుగుతుంది.

Advertisement

ఇక ఈ విషయంలో తాజాగా బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ స్పందించాడు. ఇండియా జట్టు పాకిస్థాన్ కు వెళ్లాలా.. వద్ద అనేది మా చేతిలో లేదు. అది ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభుత్వం ఏ ఆదేశాలు ఇస్తే మేము వాటినే ఫాలో అవుతాం అని బిన్నీ పేర్కొన్నాడు. ఇక అదే విధంగా మేము పాకిస్థాన్ తో ఎప్పటికైనా ఆడుతాం అని కూడా ఆయన పేర్కొన్నాడు. అయితే చూడాలి మరి ఈ విషయంలో సెంట్రల్ ఏ ఆదేశాలు ఇస్తుంది అనేది.

ఇవి కూడా చదవండి :

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్ లో ఎవరంటే..?

ఇండియా లేకపోతే మేము లేము అని గుర్తించిన పాకిస్థాన్..!

Visitors Are Also Reading