Home » రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత ఎంగేజ్ మెంట్ లో సినీతారల సందడి మామూలుగా లేదుగా..!

రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత ఎంగేజ్ మెంట్ లో సినీతారల సందడి మామూలుగా లేదుగా..!

by Anji
Ad

సాధారణంగా సెలబ్రిటీలలో ఎవరిదైనా పెళ్లి, ఎంగేజ్ మెంట్ పలు కార్యక్రమాలు జరిగినప్పుడు సినీ సెలబ్రిటీలు అంతా ఒకచోటకు చేరి సందడి చేస్తుంటారు. తాజాగా రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా వీరు పెళ్లి చేసుకుంటున్నారని పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Advertisement

గత కొద్ది రోజుల నుంచి ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట తాజాగా నిశ్చితార్థం జరుపుకున్నారు. బుల్లితెరపై పలు షోలలో ప్రేమికుల్లా సందడి చేసిన ఈ జోడి నిజ జీవితంలోనూ ఒకటవ్వనుంది. ఈ వేడుకకు జబర్దస్త్ నటులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా, యాంకర్ రవి, అనసూయ, గెటప్ శ్రీను తదితరులు పాల్గొని ఈ జంటను ఆశీర్వదించారు.

Advertisement

తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించింది సుజాత. తమ నిర్ణయాన్ని పెద్దలు గౌరవించి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపింది. రాకేష్ తో పరిచయం అయినప్పటి నుంచి స్నేహం, ప్రేమ, చివరికి పెళ్లి వరకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలను ఓ వీడియోలో షేర్ చేసింది సుజాత. అతి త్వరలోనే పెళ్లి డేట్ ను కూడా ప్రకటించనున్నట్టు తెలిపింది. దీంతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న వీరికి  పలువురు సినీ తారలు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

Also Read :   Unstoppable 2 : పవన్ కళ్యాణ్ ప్రోమో చూశారా..?

Visitors Are Also Reading