క్రికెట్ లో రికార్డులు క్రియేట్ చేయడం ఎంత కష్టమే.. బ్రేక్ చెయ్యడం అంత కష్టం. కానీ కొన్ని చెత్త రికార్డులు అనేవి వద్దు అనుకున్న క్రియేట్ అవుతాయి. అలాగే బ్రేక్ అవుతాయి. ఇప్పుడు అలాంటి తన రికార్డు బ్రేక్ అయ్యింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ రాబిన్ పీటర్సన్. అయితే 2003 లో దక్షిణాఫ్రికా , వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాబిన్ పీటర్సన్ ఓ చెత్త రికార్డు క్రియేట్ చేసాడు. అదేంటంటే టెస్ట్ మ్యాచ్ లో ఒక్కే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో విండీస్ బ్యాటర్ బ్రియాన్ లారా… ఒక్కే ఓవర్లో రెండు సిక్సులు, నాలుగు ఫోర్లతో 28 పరుగులు చేసాడు.
Advertisement
దాంతో ఈరోజు వరకు టెస్టులో ఒక్కే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన రికార్డు రాబిన్ పీటర్సన్ పేరిట ఉంది. కానీ నేడు ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆ రికార్డును బ్రేక్ చేసాడు. ప్రస్తుతం ఇండియాతో జరుగుతున్న మ్యాచ్ లో 10వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన బుమ్రాకు బౌలింగ్ చేసిన బ్రాడ్ ఒక్క ఓవర్ లోనే మొత్తం 35 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో బుమ్రా నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. అందులో ఒక్కటో నో బాల్. అలాగే ఇంకో బంతి వైడ్ ఫోర్ గా వెళ్లడంతో 35 పరుగులు వచ్చాయి అందువల్ల రాబిన్ పీటర్సన్ రికార్డు బ్రేక్ అయ్యింది.
Advertisement
అయితే దీని పై తన ట్విట్టర్ వేదికగా రాబిన్ పీటర్సన్ స్పందిస్తూ.. ఈరోజు నా రికార్డు అనేది బ్రేక్ అవ్వడం చాలా భాధగా ఉంది. అయిన కూడా క్రికెట్ లో రికార్డులు బ్రేక్ కావడం మాములు విషయే” అని పోస్ట్ చేసాడు. అయితే ఈ పోస్ట్ చుసిన ఎవరికైనా రాబిన్ పీటర్సన్.. బ్రాడ్ ను ఉద్దేశించి ఎటకారంగా పోస్ట్ చేసినట్లు ఇట్టే అర్ధం అవుతుంది. అయితే బుమ్రా ఈ ఓవర్లో రేచిపోవడంవల్లే టీం ఇండియా ఆల్ ఔట్ సమయానికి 416 పరుగులు చేయగలిగింది. లేకుంటే.. 400 మార్కును టీం ఇండియా దాటడం చాలా కష్టం అయ్యేది.
ఇవి కూడా చదవండి :