మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా వచ్చే నెలలో వచ్చే నెలలో విడుదలు సిద్ధంగా ఉన్నది. పిబ్రవరి 04న ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లలో అలరించనున్నది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన అప్‌డేట్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసాయి. ముఖ్యంగా రెండు రోజుల కిందట ‘ఆచార్య’ నుంచి విడుదలైన ఐటెం సాంగ్ శానా కష్టం కు మంచి రెస్పాన్స్ వస్తున్నది. అయితే ఇప్పుడు అదే సాంగ్ కారణంగా చిక్కుల్లో పడ్డారు మేకర్స్.
Advertisement
Advertisement
తాజాగా ఆచార్య పాటపై ఆర్ఎంపీ వైద్యుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆచార్య చిత్ర యూనిట్ తాజాగా “శానాకష్టం” ఐటెమ్ సాంగ్ నెంబర్ ను విడుదల చేసింది. మణిశర్మ స్వరపరిచిన ఈ మాస్ సాంగ్ ఇన్‌స్టంట్‌గా హిట్ అయినది. భాస్కరబట్ల లిరిక్స్ అందించిన ఈ పాటను రేవంత్, గీతామాధురి ఆలపించారు. ఈ పాటలో మెగాస్టార్ తో పాటు రెజీనా కసాండ్రా చిందేసింది. ఈపాటలో ‘ఏడేడో నిమరొచ్చని కుర్రాళ్లు ఆర్ఎంపీలు అయిపోతున్నారే’ అనే లిరిక్ ఉన్నది. యువకులు రెజీనా లాంటి స్త్రీని ముట్టుకునే అవకాశం కోసం ఆర్ఎంపీ డాక్టర్ అవుతున్నారని అర్థం వచ్చేలా ఉందా లిరిక్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్ వైద్యులు పాటలోని ఈ వాక్యాన్ని తప్పుగా భావిస్తున్నారు.
ఈ పాట తమ వృత్తిని అవమానించే విధంగా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు తెలంగాణ జనగామకు చెందిన ఆర్ఎంపీ వైద్యుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసినది. గీత రచయిత, దర్శకుడి పై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. దీనిపై ఆచార్య చిత్ర యూనిట్ ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరీ.