తెలుగు సినిమా ఇండస్ట్రీలో మధ్యతరం హీరోయిన్లలో రోజా కూడా ఒకరు. ఆమె ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. అలాంటి రోజా ఇండస్ట్రీలో ఎంత పేరు సంపాదించుకుందో అంత మంచి మనసు కలిగిన నటి అని చెప్పవచ్చు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం ఈమె సొంతం. ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారిన బుల్లితెర షోల ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకుంది.
READ ALSO : కేవలం ఒకే ఒక టీవీ ఇంటర్వ్యూ ఎన్టీఆర్ జీవితాన్ని ఎలా చిన్నాభిన్నం చేసిందో తెలుసా ?
Advertisement
ప్రస్తుతం రోజా వైయస్సార్ ప్రభుత్వంలో మంత్రి పదవి రావడంతో సినిమాలకు మరియు బుల్లితెర షోలకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రజాసేవలో ముందుకు పోతోంది. ఇక రోజా ఫ్యామిలీ విషయానికి వస్తే తండ్రి నాగరాజారెడ్డి, తల్లి లలితారెడ్డి మధ్య తరగతి ఫ్యామిలీ. నాగరాజారెడ్డి డాక్యుమెంటరీలో సౌండ్ ఇంజనీర్, తల్లి లలిత నర్సుగా చేసేది. చిత్తూరు జిల్లా బకరాపేటకు చెందిన ఈ దంపతులకు 1972లో రోజా జన్మించింది. అసలు పేరు శ్రీలత. ఈమెకు కుమారస్వామి రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి అనే ఇద్దరు సోదరులు ఉన్నారు.
Advertisement
పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ లో పీజీ చేసిన రోజా 17 ఏళ్ల ప్రాంతంలో సినీ ఛాన్స్ కొట్టేసింది. కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్ లో రోజా ఫోటోలు చూసిన సినీ రంగ వ్యక్తులు ఆ తర్వాత ఆమె కుటుంబాన్ని సంప్రదించారు. ఇలా ప్రేమ తపస్సు మూవీ ద్వారా టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన శ్రీలత రోజాగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత సీతారత్నం గారి అబ్బాయి, బొబ్బిలి సింహం, ముఠామేస్త్రి, బైరవద్వీపం, శుభలగ్నం, పోకిరి, రాజా వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా చేరింది. మంచి పొజిషన్ లో ఉండగానే సేల్వమని ప్రేమలో పడిన రోజా అతన్ని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు హంస మాలిక అనే కూతురు, కృష లోహిత్ అనే కొడుకు ఉన్నారు.
READ ALSO : కొరటాల శివ భార్య ఎవరు…ఆమె ఏం చేస్తుందో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు !