Telugu News » Blog » కొరటాల శివ భార్య ఎవరు…ఆమె ఏం చేస్తుందో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు !

కొరటాల శివ భార్య ఎవరు…ఆమె ఏం చేస్తుందో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు !

by Bunty
Ads

SS రాజమౌళి తర్వాత అంతే స్టార్ ఇమేజ్ కలిగిన దర్శకుడు ఎవరన్నా ఉన్నారా అంటే అది కొరటాల శివ అనే చెప్పాలి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను అనే నాలుగు చిత్రాలు తెరకెక్కించి నాలుగు బ్లాక్ బస్టర్లు అందుకుని స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు దర్శకుడు కొరటాల. ఇదిలా ఉంటే తన చిత్రాలతో కేవలం హిట్లు కొట్టడం మాత్రమే కాదు, ఏదో ఒక సామాజిక అంశాన్ని టచ్ చేసి ప్రేక్షకులకు మంచి మెసేజ్ కూడా ఇస్తుంటాడు కొరటాల.

Advertisement

ఆయన ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడానికి, ఆయన సక్సెస్ వెనక కారణం తన భార్య అని చాలా సందర్భాల్లో ఒక కొరటాల శివ చెప్పుకొచ్చారు. అవును ప్రతి పురుషుని వెనుక ఓ స్త్రీ ఉంటుంది కదా, అలాగే కొరటాల శివ వెనుక ఉన్న స్త్రీ మూర్తి ఆయన భార్య అరవిందా. ఇక ఆమె మొదటి నుంచి రామకృష్ణ పరమహంస భక్తురాలు కావడంతో రామకృష్ణుని బోధనలతో విశేషంగా ప్రభావితం అయింది.

Advertisement

ప్రతి ఆదివారం ఆమె రామకృష్ణ మతానికి వెళ్లి సేవలు అందిస్తుంది. ఇక శ్రీమంతుడు కాన్సెప్ట్ ఆమె ఫిలాసఫీ నుంచి వచ్చిందేనట. అందుకే కోట్లు సంపాదించిన నేటికీ చిన్న అపార్ట్మెంట్ లోనే ఉంటున్నారు ఈ దంపతులు. ఎంత సంపాదించిన అవసరానికి మించి ఉండకూడదని, తినడానికి, బతకడానికి అవసరమైనది ఉంచుకొని మిగిలింది తిరిగి సమాజానికి ఇచ్చేయాలనే సిద్ధాంతం ఆమె ఫాలో అవుతారు. అందుకే సంపాదనలో అధిక భాగం సమాజసేవకే వినియోగిస్తూ ఆత్మ తృప్తి పొందుతున్నారట అరవింద. డైరెక్టర్ లైఫ్ కన్నా ఓ మంచి వ్యక్తికి భర్తగా జీవితం చాలా బాగుంటుందని కొరటాల చాలా సందర్భాల్లో భార్య అరవింద గురించి చెప్పటం విశేషం.

Advertisement

READ ALSO : కేవలం ఒకే ఒక టీవీ ఇంటర్వ్యూ ఎన్టీఆర్ జీవితాన్ని ఎలా చిన్నాభిన్నం చేసిందో తెలుసా ?