భారతీయ మూలాలు మరియు భారతదేశ వ్యక్తికీ అల్లుడైనా రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయిన విషయం అందరికి తెలిసిందే.. ఆయన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తిని 2009లో వివాహం చేసుకున్నారు. అయితే వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం కాదు. మరి మీరు ఎక్కడ కలిశారు.. ప్రేమ ఎక్కడ చిగురించింది.. అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. బెంగళూరు రాష్ట్రంలోని బాల్డ్విన్ గర్ల్స్ హై స్కూల్ లో చదువుకుంది అక్షతామూర్తి.
Advertisement
also read:మొదటి భార్యను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న ఆ జబర్దస్త్ కమెడీయన్..!
Advertisement
స్కూల్లో కూడా ఎప్పుడు ఆడంబరం ప్రదర్శించేది కాదు. ఆ తర్వాత కాలిఫోర్నియాలో ఎకనామిక్స్, లాస్ ఏంజెల్స్ లో ఫ్యాషన్ డిజైనర్ డిప్లమా చేసింది. స్టాన్ ఫార్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. ఈ టైంలోనే రిషితో అక్షతమూర్తికి పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారింది.. 2009లో వీరి వివాహం బెంగళూరులో జరిగింది. రిషి సునాక్ అక్షత మూర్తి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. వారి పేర్లు కృష్ణ, అనౌషిక. కట్ చేస్తే..రిషి వెంట ఎల్లప్పుడూ సపోర్ట్ గా ఉంటూ తనను ప్రోత్సహించేదని ఆయన చాలా ఇంటర్వ్యూలో అక్షతమూర్తి గురించి చెప్పకనే చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె ముఖ్య పాత్ర వహించిందని చెప్పుకొచ్చారు.. అక్షతమూర్తి సునక్ కు ఒక స్నేహితురాలిగా అన్ని విషయాలు చెబుతూనే భార్యగా తనదైన శైలిలో నడుచుకుందని, ఆమె అంత సపోర్టివ్ గా ఉంది కాబట్టే రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కాగలిగాడని అతను పలు ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను చూస్తే అర్థం చేసుకోవచ్చు.
also read: