Home » మొదటి భార్యను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న ఆ జబర్దస్త్ కమెడీయన్..!

మొదటి భార్యను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న ఆ జబర్దస్త్ కమెడీయన్..!

by Anji
Ad

ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే బ‌జ‌ర్ద స్త్ కామెడీ షో గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. జ‌బ‌ర్ద‌స్త్ షో చేసే క‌మెడీయ‌న్ల‌లో ఒక‌రైన‌టువంటి పంచ్ ప్ర‌సాద్ గురించి సోష‌ల్ మీడియాలో ఓ వార్త తెగ వైర‌ల్ అవుతోంది. ముఖ్యంగా ఈయ‌న రెండో పెళ్లి చేసుకున్నాడ‌ని.. మ‌రో క‌మెడీయ‌న్ ఇమ్మానియేల్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. పంచ్ ప్ర‌సాద్ ఇన్‌స్టాగ్రామ్ స్టేట‌స్‌లో పెళ్లి ఫోటో షేర్ చేశాడు. ఇది అధికారికంగా స‌మాచారం అనే విధంగా హింట్ ఇచ్చాడు. పంచ్ ప్ర‌సాద్ గురించి ఇమ్మానియేల్ చేసిన పోస్ట్ సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైర‌ల్ అవుతోంది. కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ప్ర‌సాద్‌కి మొద‌టి భార్య త‌న కిడ్నీ కూడా ఇస్తామ‌న్నారు. అలాంటి మ‌హిళ‌ను వ‌దిలేసి పంచ్ ప్ర‌సాద్ రెండో పెళ్లి చేసుకోవ‌డ‌మేంటంటూ అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Also Read : మ‌హేశ్ బాబు కెరీర్ బెస్ట్ “ఒక్క‌డు” సినిమాను మిస్ చేసుకున్న‌ స్టార్ హీరో ఎవరో తెలుసా..? ఎలా మిస్ అయ్యిందంటే..?

Advertisement

వాస్తవానికి ప్ర‌సాద్ రెండో పెళ్లి చేసుకోలేదు. ఇదంతా ఇమ్మానియేల్ చేసి మ్యాజిక్ అండ్ క‌న్‌ఫ్యూజ‌న్. ఒక యూట్యూబ్ వీడియోకి వ్యూస్ తెచ్చేందుకు ఇమ్మానియేల్ ఇలా చేసాడు. ప్ర‌సాద్ పెళ్లి ఫోటోలో అమ్మాయి ముఖం బ్ల‌ర్ చేయ‌డంతో చాలా మంది వాస్త‌వ‌మే అని న‌మ్మేశారు. ఇటీవ‌ల శ్రీ‌దేవి డ్రామా కంపెనీ షోలో పంచ్ ప్ర‌సాద్‌, అత‌ని భార్య‌కు పెళ్లి చేశారు. ఆ సంద‌ర్భంగా కొన్ని ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇంట్లో ప్ర‌సాద్‌కి భార్య‌కు మ‌ధ్య జ‌రిగిన కొన్ని సంభాష‌ణ‌లు, వీడియోలు కూడా శ్రీ‌దేవి డ్రామా కంపెనీ వేదిక‌పై ప్ర‌ద‌ర్శించారు.

Advertisement

Also Read : SR.NTR తెలుగు ఫేస్, ఆయనకు అంత సీన్ లేదంటూ అవమానించిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

ఈ వీడియోకి ప్ర‌సాద్‌కి రెండో పెళ్లి అని థంబ్‌నైట్ పెట్టి ఫోటో విడుద‌ల చేశారు. వాస్త‌వానికి పంచ్ ప్ర‌సాద్ ఎవ‌రినీ మ‌రో పెళ్లి చేసుకోలేదు. కొద్ది రోజులుగా పంచ్ ప్ర‌సాద్ కిడ్నీ సంబంధించిన వ్యాధితో బాధ‌ప‌డుతూనే ఉన్నాడు. ఈ చికిత్స‌కి అవ‌స‌రం అయిన డ‌బ్బులు జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడీయ‌న్స్‌, జ‌డ్జేస్ రోజా, నాగ‌బాబు స‌మ‌కూర్చారు. అనారోగ్యం కార‌ణంగా పంచ్ ప్ర‌సాద్ చాలా కాలం పాటు బుల్లితెర‌కు దూర‌మ‌య్యాడు. ఆరోగ్యం కుదుట‌ప‌డ‌డంతో మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు ప్ర‌సాద్‌. ప్ర‌స్తుతం జ‌బ‌ర్ద‌స్త్ తో పాటు శ్రీ‌దేవి డ్రామా కంపెనీ, జాతిరత్నాలు, వంటి ప‌లు షోల‌లో ప్ర‌సాద్ క‌నిపిస్తున్నారు. అత‌ని స‌మ‌స్య తెలిసిన మిత్రులు అవ‌కాశాలు ఇచ్చి ప్రోత్సాహ‌మందిస్తున్నారు. వారానికి రెండు సార్లు పంచ్ ప్ర‌సాద్ డ‌యాల‌సిస్ చేయించుకున్న‌ట్టు స‌మాచారం.

Also Read : మ‌హేశ్, ప‌వ‌న్, ఎన్టీఆర్ ల 25వ సినిమాలో ఉన్న కామ‌న్ పాయింట్ ను గ‌మ‌నించారా..?

 

Visitors Are Also Reading