Home » కాంతారా 2 పై కీలక అప్డేట్ ఇచ్చిన రిషబ్ శెట్టి.. సినిమా ఎప్పుడంటే..?

కాంతారా 2 పై కీలక అప్డేట్ ఇచ్చిన రిషబ్ శెట్టి.. సినిమా ఎప్పుడంటే..?

by Anji
Ad

కన్నడ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తన పుట్టిన రోజు సందర్భంగా కాంతారా 2 అప్డేట్ ను పంచుకుంటాడని అభిమానులు ఆశించారు. కానీ అదేమి జరుగలేదు. అయితే కానీ తన పుట్టిన రోజున ముగింపు వేడుకల్లో రిషబ్ శెట్టి ఎట్టకేలకు కాంతారా 2 సినిమా గురించి మాట్లాడాడు. సినిమా ఏ దశలో ఉంది..? చిత్రీకరణ ఎప్పుడు..? మూవీపై వస్తున్న వార్తల్లో ఏది వాస్తవమో ఏది అబద్దమో చెప్పాడు. కాంతారా 2 పనులు జరుగుతున్నాయి.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఇక నుంచి లొకేషన్ సెర్చ్, ఆర్టిస్ట్ ఎంపిక జరుగుతుంది. ఇక ఆ తరువాత మూవీ షూటింగ్ గురించి హోంబలే ఫిలింస్ అధికారికంగా ప్రకటిస్తోంది. 

Advertisement

హోంబలే ఫిలింస్ అధికారికంగా ప్రకటిస్తుంది. కాంతారా 2 చిత్రాన్ని ఈ ఏడాది ప్రకటించే చిత్రీకరించి 2024లో విడుదల చేస్తామని రిషబ్ తెలిపారు. ఇక అదే సమయంలో కాంతార సీక్వెల్ పై వస్తున్న పుకార్లను నమ్మకూడదని సూచించారు. పుట్టిన రోజు వేడుకల గురించి మాట్లాడుతూ.. “ నేను పట్టణంలో ఉన్నప్పుడు పుట్టిన రోజు వేడుకల ఆలోచన లేదు. కళాశాలకు వచ్చిన తరువాత.. ముఖ్యంగా బెంగళూరు వచ్చిన తరువాత ఇలా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నాను. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా నా పుట్టిన రోజున పని చేయాలనే ఆలోచన వచ్చింది. ఈసారి అభిమానులను కలవాలనుకున్నాను. అదేవిధంగా స్నేహితులు కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఈ వేడుకలు జరుగుతున్నాయి. అని రిషబ్ చెప్పుకొచ్చారు. 

Advertisement

కాంతారావు తరువాత ఇంటికి చాలా మందికి వచ్చారు. ఇతర కార్యక్రమాలకు వెళ్లినప్పుడు కలిసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఆ తరువాత చాలా మంది మెసెజ్ లు చేశారు. కాంతార తరువాత అభిమానులకి కృతజ్ఞతలు చెప్పాలి. ఇంతకంటే మంచి ప్లాట్ ఫామ్ దొరకదు అనుకున్నాం. అందుకే పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నాను అని రిషబ్ చెప్పుకొచ్చాడు.కాంతారా సినిమా తరువాత రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కర్ణాటకలో కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకు అభిమానులున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

హీరో నాగచైతన్య దగ్గర ఖరీదైన బైకులు, కార్లు .. వాటి ధర ఎంత అంటే ?

నోలన్ సినిమాకు తెలుగులో ‘ఏ’ సర్టిఫికెట్.. అందుకోసమేనా..?

Visitors Are Also Reading