శ్రీలంకతో జరుగుతున్న రెండవ టెస్ట్‌లో భారత యంగ్ సెన్సేషనల్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మెరుపు హాప్ సెంచరీ చేసాడు. క్రీజులోకి వస్తూనే రెండవ బంతికే భారీ సిక్సర్ బాదిన రిషబ్ పంత్, 28 బంతుల్లో 7 పోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంతకు ముందు 1982లో కరాచీలో పాకిస్తాన్‌పై 30 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. ఇప్పటి వరకు టీమిండియా తరుపున టెస్ట్ ల్లో ఇదే ఫాస్టెస్ట్ హాప్ సెంచరీ. తాజాగా రిషబ్ పంత్ ఆ రికార్డును 28 బంతుల్లో హాఫ్ సెంచరీతో బ్రేక్ చేసాడు.
Advertisement
Advertisement
ఫోర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తరువాత రెండవ బంతికే శ్రీలంక ఎల్బీడబ్ల్యూ రివ్యూ తీసుకోగా ఫలితం వికెట్లను మిస్ అవుతున్నట్టు వచ్చింది. ఆ తరువాత బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు పంత్. దీంతో 184 పరుగుల వద్ద ఐదవ వికెట్ కోల్పోయింది టీమిండియా. 327 పరుగుల ఆధిక్యంలో ఉంది భారత జట్టు. తొలి ఇన్నింగ్ అనుభవాల కారణంగా రెండవ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించింది భారత జట్టు. కెప్టెన్ రోహిత్ శర్మ 79 బంతుల్లో 4పోర్లతో 46 పరుగులు చేశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద మాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
Also Read : ఆర్ఆర్ఆర్ కొత్త పాట “ఎత్తరజెండా” లో ఈ విషయాన్ని గమనించారా..?