గత సంవత్సరం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై సంచలనాలు సృష్టించిన మూవీ ఏదైనా ఉంది అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది కాంతారా.. హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ అనేక సంచలనాలు సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సాధించింది. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది.
READ ALSO : “రైటర్ పద్మభూషణ్” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే !
Advertisement
READ ALSO : 12 ఏళ్లు ప్రేమించుకున్నాం… 6 ఏళ్లు కష్టాలు అనుభవించాం- మంచి మనోజ్
Advertisement
అయితే దర్శకత్వంలోనే కాదు, నటుడిగాను ప్రశంసలు అందుకున్న రిషబ్ తాను సినిమా పరిశ్రమలోకి రావడానికి పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను కలిశారు. ఈ నేపథ్యంలోనే రిషబ్ శెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చేందుకు సీఎంను కలిసారని రిషబ్ శెట్టి తెలిపారు.
తాను కాంతార సినిమా చేసేటప్పుడు అడవుల్లో తిరిగానని, దానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాన్ని అందించాలని చెప్పారు. నేను కాంతార చేసేటప్పుడు అడవుల్లోని ప్రజలను కలిశాను. వీరితో పాటు అటవీ అధికారులను కలిసే అవకాశం కూడా వచ్చింది. అడవుల్లో మంటలు లాంటి అనేక సమస్యలు నా దృష్టిలోకి వచ్చాయి. వీటన్నింటినీ కలిపి 20 పాయింట్లతో వినతి పత్రాన్ని సమర్పించాను. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆయన లాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు గర్వంగా ఉంది అని చెప్పారు రిషబ్ శెట్టి.
READ ALSO : పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్… అసలు కారణం ఇదే,?