తాజాగా విడుదలైన సినిమాలలో కాంతారా మూవీ సెన్సేషనల్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది.. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీ ని దాటి పాన్ ఇండియా లెవెల్ లో ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. దర్శకుడి గా హీరోగా రిషబ్ శెట్టికీ భారతదేశం మొత్తంలో మంచి పేరు క్రియేట్ చేసింది. అలాంటి సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. అది ఏంటయ్యా అంటే ఈ చిత్రంలో అందరూ ట్రై చేసిన శబ్దం.. అదేనండి “ఓ” అని అరుపు ఈ శబ్దాన్ని అందరూ వినే ఉంటారు. కానీ దీని వెనుక ఒక పెద్ద సెంటిమెంట్ ఉందని దర్శకుడు రిషబ్ శెట్టి అంటున్నారు.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..
Advertisement
also read:కాంతారా సినిమా గురించి కంగనా రనౌత్ ఏమందో తెలుసా ?
Advertisement
ప్రస్తుతం ఇండియా మొత్తం వినిపిస్తున్న సినిమా పేరు కాంతారా.. ఈ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమ సరిహద్దులు దాటుకొని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ సంపాదించుకుంది. తమిళ్,కర్ణాటక,కేరళ లలో కొన్ని ప్రాంతాల్లో అనుసరించేటటువంటి భూత కోలా అనే ప్రాచీన ఆచారాన్ని ఇందులో క్లియర్ గా చూపించారు.. దైవ నర్తకులు ఈ భూతకోలను ప్రదర్శిస్తూ”ఓ”ఓ” అని అరుస్తారు.. ఈ సినిమాలో మొత్తం ఈ అరుపులు స్పెషల్ ఎఫెక్ట్ అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు కూడా” ఓ”ఓ”ఓ” అని అరుస్తు సినిమా ఎంజాయ్ చేసిన విధానాన్ని చూపిస్తున్నారట..
అయితే దీనిపై తాజాగా స్పందించిన కాంతారా హీరో దర్శకుడు రిషబ్ ఇలా అన్నారట.. ఓ అనే అరుపు సాంప్రదాయానికి సంబంధించినది, దయచేసి అభిమానులు ఎవరు కూడా దీన్ని అనుకరించ వద్దని విజ్ఞప్తి చేశారు. ఇది ప్రాచీన సంస్కృతికి చెందిన సున్నితమైన అంశం కావడంతో వారి ఆచారం దెబ్బతినే అవకాశం ఉందని తెలియజేశారు.. ఈ శబ్దాన్ని అరుపు గా కాకుండా సెంటిమెంట్ గా భావిస్తామని స్పష్టంచేశారు.
also read: