ఐపీఎల్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు అద్భుతాలు చేసి భారత జట్టులోకి రవళి అనుకుంటారు. అలా వచ్చిన వారు కూడా ఉన్నారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ పృథ్వీ షా ఐపీఎల్ లో ఎంత రాణించిన భారత జట్టులోకి మాత్రం రాలేకపోతున్నాడు. అందుకు అతని ఫిట్నెస్ ఒక్క సమస్య కాగా.. నిలకడలేని ఫామ్ మరో కారణం.
Advertisement
అయితే ఐపీఎల్ 2022 లో కూడా మొదటి రెండు మ్యాచ్ లలో దారుణంగా విఫలమైన షా.. ఆ తర్వాత ఆడిన రెండు మ్యాచ్ లలో మాత్రం వీరవిహారం చేసాడు. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. వరుస అర్ధశతకాలతో రెచ్చిపోయాడు. వరుసగా విఫలాం అయిన తరవాత ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ తనను ఓటరిగా రూమ్ లోకి పిలిచాడని చెప్పాడు. అలా వెళ్లి వచ్చిన తర్వాత రెచ్చిపోతున్న పృథ్వీ షా.. పాంటింగ్ ఏం చెప్పాడు అనేది ఆత్రం బయటపెట్టలేదు.
Advertisement
ఇక తాజాగా పృథ్వీ షా గురించి పాంటింగ్ మాట్లాడుతూ… ఆతను టీం ఇండియా కోసం తప్పకుండ 100 టెస్టులు ఆడుతాడు అని చెప్పాడు. పృథ్వీషా ఆటను చూస్తుంటే అతనిలో ఎంతో టాలెంట్ ఉందని అనిపిస్తుందని తెలిపాడు. జాతీయ జట్టుకు అతడు ఆడేలా తాయారు చేయడమే.. తన కోరిక అన్ని చెప్పిన పాంటింగ్… దూకుడుగా ఆడడంలో పృథ్వీషా అస్సలు వెనుకాడడం లేదని… పృథ్వీ షాలో మంచి ప్రతిభ దాగి ఉందని.. దానిని బయటకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :
అన్నం తిన్న తర్వాత ఈ పనులు చేస్తున్నారా.. దరిద్రానికి స్వాగతం చెప్పినట్టే..!
ధోనీ ఒక్కడే ప్రపంచ కప్ గెలిపిస్తే.. మిగతా 10 మంది లస్సీ తాగడానికి వెళ్లారా?