టాలీవుడ్ హిట్ దర్శకుల్లో ఒకరైన శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్ సినిమాతో టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా, హీరోయిన్ రీచా గంగోపాద్యాయ ఇద్దరూ పరిచయమయ్యారు. అయితే రానా వరుస సినిమాలతో దూసుకెళున్నారు. హీరోయిన్ గా నటించిన రిచా గంగోపాధ్యాయ తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయింది.
Advertisement
ఆ తరువాత తెలుగులో రవితేజ నటించిన మిరపకాయ్, ప్రభాస్ నటించిన మిర్చి, నాగార్జున నటించిన భాయ్, రవితేజ హీరోగా నటించిన సారొచ్చారు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ముఖ్యంగా వీటన్నింటిలో ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, బెంగాలీలో కూడా పలు సినిమాల్లో నటించింది. సినిమా ఇండస్ట్రీలో కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా అమెరికాకి వెళ్ళిపోయింది రిచా.
Advertisement
అమెరికాలోనే కొలంగెళ్ళ తో ప్రేమలో పడి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుంది. గత ఏడాది మే నెలలోనే రీఛా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రీచా కొడుకు పేరు లూక శ్యామ్ లాంగెళ్ల. ప్రస్తుతము ఈమె ఫ్యామిలీతో బిజీగా గడుపుతోంది. నాగార్జున హీరోగా నటించిన భాయ్ సినిమాలో చివరిసారిగా 2013లో కనిపించింది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉన్న రిచా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంది.
తాజాగా తన భర్త, కుమారునితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది రీచా. ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఓ ఫంక్షన్ లో తన భర్,త బిడ్డతో కలిసి ఉన్న ఫ్యామిలీ ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీచా తల్లి అయిన తర్వాత కొంచెం బొద్దుగా ఉండడంతో ఫోటోలో రీచాను గుర్తుపట్టడం కొంచెం కష్టమే అని చెప్పవచ్చు. బొద్దుగా అయినప్పటికీ ఆమె అందంగా ఉండడంతో తాజాగా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది అయితే బ్యూటిఫుల్ కపుల్ అని నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు. సినిమాల్లో నటించాల్సిన రిచా ఇలా ఫ్యామిలీతో కనిపిస్తోంది.
Also Read :
ఆ ఒక్క కారణం వల్లే..! సురేఖ ని పెళ్లి చేసుకోవడం చిరంజీవి తండ్రికి ఇష్టం లేదట ..! కానీ చివరికి…!
పెళ్లి జరిగిన కొద్ది సేపటికే అబ్బాయిగా మారిన వధువు.. షాక్ కు గురైన వరుడు..!