ప్రస్తుతం మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. దేశమంతటా వరి ఉత్పత్తి భారీ ఎత్తున పెరిగినప్పటికీ బియ్యం ధరలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మధ్యతరగతి వారికి కాస్త ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా భారత్ రైస్ ని తీసుకొచ్చింది. సామాన్య, పేద ప్రజలకు అతి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించే దిశగా ప్రభుత్వం భారత్ బ్రాండ్ పేరిట ఈ బియ్యం ని తీసుకొచ్చినట్లు సమాచారం. ఇక ఈ బియ్యాన్ని కిలో 29 రూపాయలకే విక్రయిస్తున్నారు. ఇప్పటికే ఈ బియ్యం విక్రయాలను కూడా ప్రారంభించారు.
Advertisement
Advertisement
హైదరాబాద్ లో ఈ బియ్యం కేంద్రాలు ఎక్కడున్నాయి అనే అంశం గురించి మాట్లాడుకున్నట్లయితే… కోటిలో కేంద్రీయ బండార్, గన్ పార్క్ సమీపంలో NaaFeed , అదేవిధంగా సుల్తాన్ బజార్లో ఎన్సిసిఎఫ్ అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు కేంద్రాలలో భారత్ పేరిట రైస్ ను విక్రయిస్తున్నారు. అతి త్వరలోనే మొబైల్ అవుట్ లైట్స్ లో కూడా ప్రారంభమవుతాయి. అంతేకాక ఈ కామర్స్ సంస్థలైనటువంటి అమెజాన్ ఫ్లిప్కార్ట్ జియో మార్ట్ వంటి సైట్లలో కూడా ఈ భారత రైస్ ఆర్డర్ ను చేసుకోవచ్చని అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇది అందుబాటులో లేవు కాని త్వరలోనే ఈ కామర్స్ లో కూడా అమ్ముతారని సమాచారం. ఇక ఈ భారత్ రైస్ 5 లేదా 10 కేజీల బ్యాగులలో మాత్రమే లభిస్తాయి.
అయితే ఈ భారత్ రైస్ ను తొలిదశలో రిటైల్ మార్కెట్ లో ఐదు లక్షల టన్నుల వరకు విక్రయిస్తామని కేంద్రం తెలియజేసింది. అయితే ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో చూసుకున్నట్లయితే కిలో సన్న బియ్యం 60 నుంచి 70 రూపాయలుగా ఉంది. ఇక ఇప్పుడు భారత రైతును అతి తక్కువ ధరకు 29 రూపాయలకే విక్రయిస్తుండడంతో సామాన్యులు దీనిని కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించినప్పటికీ బియ్యం ధర 15% మేర పెరగడంతో సామాన్యుల కోసం భారత్ కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది.