Home » పవన్ తన ఫ్యాన్స్ ని, కాపుల్ని వెన్నుపోటు పొడిచాడు – ఆర్జీవి సంచలనం

పవన్ తన ఫ్యాన్స్ ని, కాపుల్ని వెన్నుపోటు పొడిచాడు – ఆర్జీవి సంచలనం

by Bunty
Ad

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతి విషయమై తన అభిప్రాయాలను మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా ట్విట్ చేస్తూ మీడియాలో హైలెట్ అవుతుంటారు. వివాదాలను క్రియేట్ చేసి అలా సంచలనాలు రేపుతుంటారు.

READ ALSO : Ustaad Bhagatsingh: “ఉస్తాద్” ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసిందిరోయ్.. పవన్ ఫ్యాన్స్ కు ఇక జాతరే

Advertisement

అయితే, తాజాగా సంచలనానికి తెర తీశారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తమకు గత ఎన్నికల్లో 30-40 సీట్లు వచ్చి ఉంటే ఈసారి ఎన్నికల్లో తాను సీఎం పదవికి రేసులో ఉండే వాడినని పవన్ కళ్యాణ్ నిన్న మంగళగిరిలో పేర్కొనడం తెలిసిందే. కానీ తాము ఒక్క స్థానంలోనే గెలవడంతో ఈసారి సీఎం పదవిని డిమాండ్ చేయలేకపోతున్నామని వివరణ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ వాక్యాలకు ఆర్జీవి కౌంటర్ ఇచ్చారు. జనసేనని చివరకూ తనను తాను కూడా వెన్నుపోటు పొడుచుకున్నాడని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆర్జీవి వరసగా రెండు ట్విట్లు చేశారు.

Advertisement

READ ALSO : Shakuntalam : ఒకరోజు ముందే ఓటిటిలోకి వచ్చేసిన “శాకుంతలం”… ఎందులో స్ట్రీమింగ్ అంటే!

pawan kalyan, RGV: కమ్మ దొరలకి తల వంచేసినట్టేనా.. మళ్లీ కెలికిన ఆర్జీవీ.. బండ బూతులు తిడుతోన్న జనసేనాని ఫ్యాన్స్ - ram gopal varma sensational tweet on janasena chief pawan ...

ఆరోజు చంద్రబాబు, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన దానికంటే దారుణంగా ఈరోజు పవన్ కళ్యాణ్ తన జన సైనికులను, తన ఫ్యాన్స్ ను వెన్నుపోటు పొడిచి చంపేశాడని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తన ప్రగాఢ సానుభూతి అని ట్విట్ చేశారు. మరో ట్వీట్ లో పవన్ కళ్యాణ్ తన సొంత ఫ్యాన్స్ ను మాత్రమే కాకుండా, తన కాపులను, చివరకు తనను తాను కూడా వెన్నుపోటు పొడుచుకున్నాడని పేర్కొన్నారు. మరో ట్వీట్ లో పవన్ కళ్యాణ్ వీడియోను పోస్ట్ చేసిన ఆర్జీవి…ఈ మాత్రం దానికి ఇంకో పార్టీ, పిడికిలి, ఎర్ర కండువాలు, చేగువేరాలు… అంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.

READ ALSO : ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్..పాక్ లో ఇంటర్నెట్, సోషల్ మీడియా “బ్లాక్”

Visitors Are Also Reading