Home » చిరంజీవి గాలి తీసేసిన వర్మ.. ఆది లాంటి వాళ్లను దూరం పెట్టు !

చిరంజీవి గాలి తీసేసిన వర్మ.. ఆది లాంటి వాళ్లను దూరం పెట్టు !

by Bunty
Ad

 

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమధ్య సినిమాలు తీయడం తగ్గించి వివాదాస్పద ట్వీట్లు, కామెంట్లు చేయడం ఎక్కువ చేశాడు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని, మెగా కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన ట్విట్లు మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తాయి.

Advertisement

తాజాగా చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాపైన రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఈ మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా పైన మెగాస్టార్ చిరంజీవి అనేక ట్రోల్స్ కి గురవుతున్నాడు. ఈ సినిమా పైన రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ… భజన పొగడ్తలకు అలవాటు పడిపోయి రియాల్టీకి మెగాస్టార్ చిరంజీవి దూరం అవుతున్నారని అనిపిస్తుందని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.

Advertisement

మళ్లీ మరోసారి అదే ట్వీట్ కు రిప్లై ఇస్తూ పొగడ్తలతో ముంచేత్తే బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వారు మరొకరు ఉండరు. రియాలిటీ తెలిసే లోపు రాజుగారు మునిగిపోతారు. వారి పొగడ్తల విషయం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైలు దూరం పెట్టడమే అంటూ ఓ కాంట్రవర్సీయల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మెగా అభిమానులు, మెగా కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి : 

Hansika : పబ్ కి తీసుకెళ్లి..బన్నీ బలవంతంగా నాతో ఆ పని చేయించాడు..!

విశాఖలో బేబీ సినిమా రిపీట్‌..3 కుటుంబాల్లో విషాదం !

నువ్వు ఎవడ్రా పవన్ కల్యాణ్..నోట్లో హెరిటెజ్ ఐస్ క్రీం పెట్టుకున్నావా ? – రోజా

Visitors Are Also Reading