Home » రేవంత్‌రెడ్డిని రియ‌ల్ టైగ‌ర్ ఆఫ్ తెలంగాణ‌గా వ‌ర్ణించిన వ‌ర్మ

రేవంత్‌రెడ్డిని రియ‌ల్ టైగ‌ర్ ఆఫ్ తెలంగాణ‌గా వ‌ర్ణించిన వ‌ర్మ

by Anji
Ad

సినీ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడిగా పేర్గాంచిన రామ్‌గోపాల్ వ‌ర్మ గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆయ‌న ఎప్పుడు ఎవ‌రినీ పొగుడుతాడో.. మ‌ర‌ల ఎవ‌రినీ తిడుతాడో అస‌లు ఎవ్వ‌రూ కూడా ఊహించ‌లేరు. ముఖ్యంగా సినిమా విష‌యంలో అయినా.. రాజ‌కీయ ప‌రంగా అయినా ఏవిధంగా అయినా వ‌ర్మ ట్విట్ట‌ర్ ఖాతాను చూసిన వాళ్ల‌కు మంచి త్రిల్లింగ్ సినిమా చూసిన‌ట్టు ఉంటుంది.


తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో క‌లిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేసిన రామ్‌గోపాల్ వ‌ర్మ.. రేవంత్ రియ‌ల్ టైగ‌ర్ ఆఫ్ తెలంగాణ అని అభివ‌ర్ణించాడు. రామ్‌గోపాల్‌వ‌ర్మ‌, రేవంత్‌రెడ్డి క‌లిసి ఉన్న ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్లీన‌రీ స‌మావేశం జ‌రిగిన రోజే వ‌ర్మ ఈ కామెంట్ పెట్ట‌డానికి అస‌లు కార‌ణం ఏమిటో అని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Advertisement


ఇక రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్ తీవ్రంగా విమ‌ర్శ‌లు చేసారు. చీమ‌లు పెట్టిన పుట్ట‌లు పాముల‌కు ఇరువైన‌య‌న్న‌ట్టు అమ‌ర‌వీరులు, ఉద్య‌మ‌కారులు చేసిన త్యాగాల‌తో ఆవిర్భ‌వించిన తెలంగాణ‌కు గులాబీ చీడ ప‌ట్టింద‌న్నారు. డొక్కు సైకిళ్లు, విరిగిన కుర్చీల నుంచి నేడు నిజాంను మించిన ధ‌నవంతులుగా క‌ల్వ‌కుంట్ల కుటుంబం అవ‌త‌రించింద‌ని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం వెనుక ఓ త‌రం తెలంగాణ విషాదం ఉంద‌ని రేవంత్‌రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

Also Read :

తాచుపాముకు స్నానం చేయించిన వ్య‌క్తి.. వీడియో వైర‌ల్‌..!

శ్రీ‌శైలంలో వాహ‌నాల‌పై బొమ్మ‌లు ఎందుకు వేస్తారో తెలుసా..?

Visitors Are Also Reading