Home » రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయం మొదలయ్యింది ! KCR అద్దిరిపోయే గిఫ్ట్ రెడీ ??

రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయం మొదలయ్యింది ! KCR అద్దిరిపోయే గిఫ్ట్ రెడీ ??

by Sravya
Ad

తెలంగాణ కాంగ్రెస్ సర్కారు కొలువుతీరిన మొదటి రోజే మాజీ సీఎం కేసీఆర్ మీద ఫిర్యాదు నమోదయింది. కాలేశ్వరం పథకంలో అవినీతి జరిగిందని దానిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఏసీబీకి హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. అవినీతి విషయంలో సిఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట కవిత, పోలవరం ప్రాజెక్టు కృష్ణారెడ్డి, ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వర్లు మీద కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

KCR Get injured

వేలాది కోట్ల ప్రచారం దోపిడీకి గురైందని భాస్కర్ అన్నారు.  తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు సాగు నీరు కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే నిర్ణయం జరిగిందని భాస్కర్ ఆరోపించారు. 7 లింకుల కింద 228 ప్రాజెక్ట్లు నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అన్నారు.

Advertisement

Advertisement

పనులు జరుగుతున్న టైంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం సీఎంగా కేసీఆర్ వచ్చారని కెసిఆర్ తో పాటుగా మంత్రులు వీళ్లంతా కూడా కలిసి ప్రాజెక్ట్ అలైన్మెంట్లు డిజైన్లు మార్చేసి ప్రాజెక్టు పరిధిని అంచనాలని పెంచాలని భాస్కర్ అన్నారు. ఈ ప్రాజెక్టు పేరుతో వేలకోట్ల రూపాయల ప్రజలను దోచుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన మొదటి రోజే ఏసీబీకి ఫిర్యాదు అందడం చర్చనీయాంశంగా మారింది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading