Home » Revanth Reddy : కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టే చివ‌రి బ‌డ్జెట్ ఇదే..!

Revanth Reddy : కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టే చివ‌రి బ‌డ్జెట్ ఇదే..!

by Anji
Ad

తెలంగాణ ప్ర‌భుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టే చివ‌రి బ‌డ్జెట్ ఇదే అంటూ జోస్యం చెప్పారు. మైనార్టీ అభివృద్ధిని కూడా అసెంబ్లీలో ప్ర‌స్తావిస్తామ‌ని పేర్కొన్నారు. క‌లెక్ట‌ర్లుగా ఎంత మందికి అర్హ‌త ఉంద‌న్న‌ది చూడాల‌న్నారు. ఎస్పీల్లో చాలా మందికి అర్హ‌త లేద‌ని పేర్కొన్నారు. అధికారులు కేసీఆర్‌కు లాయ‌ల్‌గా ఉంటున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

Advertisement

 

ఐదుగురు అధికారుల చేతుల్లో 40 శాఖ‌లు ఉన్నాయ‌ని, అధికారుల అండ‌తో సీఎం వేల కోట్లు కొల్ల‌గొడుతున్నార‌ని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క అధ్య‌క్ష‌త‌న సీఎల్పీ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించారు.

Advertisement

ఈ సంద‌ర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ముఖ్యంగా మ‌నం ఏ పోరాటం చేసినా గృమ నిర్బంధం చేస్తున్నార‌ని.. ఫ‌ల‌క్‌నుమా నుంచి ఎయిర్‌ఫోర్ట్ వ‌ర‌కు మెట్రో వేయ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌చ్చిబౌలి నుండి ఎయిర్ ఫోర్ట్‌కు మెట్రో వేయ‌డానికి కార‌ణ‌మేమిటని రేవంత్‌రెడ్డి ప్ర‌శ్నించారు. మైనార్టీ అభివృద్ధిని అసెంబ్లీలో ప్ర‌స్తావిస్తామ‌ని తెలిపారు. సీఎస్ సోమేశ్‌కుమార్ ద‌గ్గ‌ర 8 శాఖ‌లున్నాయ‌ని, సుల్తానియా ద‌గ్గ‌ర 6 శాఖ‌లున్నాయ‌ని సోమేశ్ ఆంధ్ర‌కు కేటాయించిన అధికారి అని తెలిపారు. కొంత మంది అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నార‌ని.. నేను ఊరికెనే మాట్లాడ‌టం లేద‌ని వెల్ల‌డించారు రేవంత్‌రెడ్డి.

Also Read :  షేన్ వార్న్ రూమ్‌లో ర‌క్త‌పు మ‌ర‌క‌లు, ట‌వ‌ల్స్‌.. అస‌లు ఏమి జ‌రిగింది..?

Visitors Are Also Reading