Home » పవన్ కళ్యాణ్ “వారహి”పై ఆంక్షలు.. ఆ ఒక్కటి తీసేయాల్సిందే..?

పవన్ కళ్యాణ్ “వారహి”పై ఆంక్షలు.. ఆ ఒక్కటి తీసేయాల్సిందే..?

by Sravanthi
Ad

పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన హీరో.. ఇండస్ట్రీలోని హీరోలందరి స్టైల్ ఒకటి ఉంటే, పవన్ కళ్యాణ్ స్టైల్ మరో తీరు ఉంటుంది. అందుకేనేమో ఆయన పవర్ స్టార్ గా మారారు.. అంతటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో స్టార్ హోదాని కొనసాగిస్తూనే ఓవైపు పాలిటిక్స్ లో దూసుకుపోతున్నారు.. జనసేన పార్టీని స్థాపించి వచ్చే ఎన్నికల్లో పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ఒక ప్లాన్ ప్రకారం ఆయన ముందుకు పోతున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే షూటింగులకు బ్రేక్ ఇచ్చి పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి సారించారు..

Advertisement

also read:కంటెంట్ ఉన్న‌ప్ప‌టికీ ఫ్లాప్ అయ్యిన 5 టాలీవుడ్ సినిమాలు ఇవే..!

ఇక ఆంధ్రప్రదేశ్ లో ఏడాదిన్నర కాలంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో అన్ని పార్టీల నాయకులు వారి వారి కార్యక్రమాల్లో చురుకుగా దూసుకుపోతున్నారు. జనసేన పార్టీ కూడా కొద్ది రోజుల్లో ప్రచార యాత్ర ప్రారంభించబోతోంది. దానికోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరికొత్త ప్రచార రథాన్ని సిద్ధం చేసుకున్నారు.. ప్రచార రథం పేరు వారాహి అని కూడా నామకరణం చేశారు.. రథానికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.. అత్యాధునిక హంగులతో ఈ ప్రచార రథం చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది.. అలాంటి రథాన్ని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద పూజ చేయించి ప్రారంభించనున్నారు పవన్ కళ్యాణ్. ఈ తరుణంలోనే ఈ ప్రచార రథంపై వివాదం మొదలైంది..

Advertisement

ఈ వాహనం మొత్తం యుద్ధ వాహనం లాగా కనిపిస్తోందని, అలీవ్ గ్రీన్ కలర్ ఈ వాహనానికు ఉపయోగించారాదని ఒక వివాదం ఏర్పడింది.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రక్షణ రంగ వాహనాలకు తప్ప ఇతర ఏ ప్రైవేట్ వాహనాలకు ఈ రంగు వాడొద్దని నిషేధం ఉంది. ఇప్పటికీ హిమాచల్ ప్రదేశ్ లో ఈ విధమైన వాహనానికి ఉత్తర్వులు జారీ చేసింది అక్కడ ప్రభుత్వం. దీంతో పవన్ కళ్యాణ్ వాహనం కూడా ఇదే రంగులో ఉండటంతో మార్పులు తప్పవని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ వాహనానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన పూర్తి కాలేదు. రిజిస్ట్రేషన్ సమయంలో రంగు మార్పుపై అభ్యంతరాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

also read:

Visitors Are Also Reading