సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరో హీరోయిన్లు నటనతోనే కాకుండా ఇతర బిజినెస్ లు చేస్తూ కూడా చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పటికే అనేక వ్యాపార సంస్థలు ప్రారంభించి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. ఇందులో బడా హీరోలు కూడా ఓ వైపు సినిమాలు చేస్తూ వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో మహేష్ బాబు కూడా వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నారట. దీంతో మరో అడుగు ముందుకు వేసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించనున్నారు.
\ఇప్పటికే మహేష్ బాబు జిఏంబి ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి ఆ సంస్థ నుంచి మేజర్ సినిమాను మొదటిసారిగా నిర్మించి విజయాన్ని అందుకున్నారు. ఈ తరుణంలోనే ఆయన మరో బిజినెస్ కూడా ప్రారంభించనున్నారని తెలుస్తోంది. అదేంటి అంటే అందరి హీరోల లాగే ఆయన కూడా హోటల్ బిజినెస్ పెట్టలనుకుంటున్నారట. ఇప్పటికే అల్లు అర్జున్ నాగార్జున, నవదీప్,శర్వానంద్, సందీప్ కిషన్ ఇలా చాలామంది స్టార్ హీరోలు ఈ బిజినెస్ ప్రారంభించి సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు.
అదే బాటలో మహేష్ బాబు కూడా హోటల్ బిజినెస్ ప్రారంభించనున్నారని సమాచారం. అయితే హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు హైదరాబాదులో ఇప్పటికే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఖరీదైన బిల్డింగ్స్ ఉన్నాయి. హోటల్ బిజినెస్ తో మరో అడుగు ముందుకు వేశారు. మహేష్బాబు వరుస విజయాలతో ఒకవైపు ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు బిజినెస్ పై ఆసక్తి చూపించడం చాలా విశేషం. అయితే ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు మాత్రం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:
- పెళ్లి పీటలు ఎక్కబోతున్న అడివి శేష్.. అమ్మాయి అక్కినేని కొడలేనా..?
- మీకు అధికంగా చెమటలు పడుతున్నాయా..? అయితే కారణం అదే..!