Home » ఆ హీరోతో ఒంటరిగా ఐస్లాండ్ కు వెళ్లాలని ఉంది… రేష్మీ వ్యాఖ్యలకు షాక్ అయిన జనాలు..!

ఆ హీరోతో ఒంటరిగా ఐస్లాండ్ కు వెళ్లాలని ఉంది… రేష్మీ వ్యాఖ్యలకు షాక్ అయిన జనాలు..!

by AJAY
Ad

జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపును సంపాదించుకున్న రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టీవీ షోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న రేష్మీ ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను కూడా దక్కించుకుంది. అందులో భాగంగా వరుస టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే సినిమాల్లో కూడా వీలుచిక్కినప్పుడల్లా నటిస్తూ వస్తుంది.

Advertisement

ఇది ఇలా ఉంటే తాజాగా రేష్మి… ఓంకార్ యాంకర్ గా వ్యవహరిస్తున్న సిక్స్త్ సెన్స్ తాజా ఎపిసోడ్ కు పాటిస్పేట్ గా వచ్చింది. ఇప్పటికే ఓంకార్ యాంకరింగ్ లో ప్రసారం అవుతున్న ఈ రియాలిటీ షో 4 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని. ప్రస్తుతం 5వ సీజన్ కొనసాగుతోంది. తాజా ఎపిసోడ్ కు రేష్మితో పాటు నటుడు బ్రహ్మాజీ కూడా వచ్చాడు. వీరిద్దరూ కలిసి ఈ షోలో నవ్వులు పోయించారు.

Advertisement

ఈ షోలో భాగంగా ఓంకార్… రేష్మి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగాడు. దానికి ఆమె కూడా ఆసక్తికరమైన సమాధాలను ఇచ్చింది. ఈ షోలో భాగంగా ఓంకార్… రేష్మి ని ఒకవేళ ఒంటరిగా ఐస్లాండ్ కు వెళ్లవలసి వస్తే ఏ హీరోతో కలిసి వెళ్తావ్ అని అడిగాడు. దీనికి రష్మీ ఇంకెవరు సుధీర్ తో కలిసి వెళతాను.

సుధీర్ కంపెనీ నాకు చాలా బాగా నచ్చుతుంది అని సమాధానం ఇచ్చేసింది. ఇదివరకే వీరిద్దరి ప్రేమ వివాహారంపై అనేక వార్తలు రావడంతో తాజాగా రేష్మి… సుధీర్ తో ఒంటరిగా ఐస్లాండ్ కు వెళ్లాలి అని ఉంది అని చెప్పడంతో రేష్మి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Visitors Are Also Reading