Home » “జ‌క్క‌న్న‌” పేరు పై జ‌ర్న‌లిస్టు షాకింగ్ కామెంట్స్…

“జ‌క్క‌న్న‌” పేరు పై జ‌ర్న‌లిస్టు షాకింగ్ కామెంట్స్…

by Bunty
Ad

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా జ‌న‌వ‌రి 7 వ తేదీన రిలీజ్ కాబోతున్న‌ది. ఈ సినిమా వ‌చ్చే ఎడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న‌ది. ఈ మూవీపై భారీ ఎత్తున అంచ‌నాలున్నాయి. దీనికి త‌గ్గ‌ట్టుగానే జ‌క్క‌న్న టీమ్ ప్ర‌మోష‌న్ చేస్తున్న‌ది. తెలుగు రాష్ట్రాల‌తో పాటుగా ద‌క్షిణాదిన చెన్నై, బెంగ‌ళూరు, ముంబై త‌దిత‌ర న‌గ‌రాల్లో భారీ ఎత్తున ప్ర‌మోష‌న్ నిర్వ‌హిస్తున్నారు.

Advertisement

Advertisement

ఈ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళితో పాటుగా టీమ్ పాల్గొని ప్ర‌మోష‌న్ చేస్తున్న‌ది. నిన్న‌టి రోజున హైద‌రాబాద్‌లో ఈ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్‌లో రాజ‌మౌళిని జ‌ర్న‌లిస్టులు అనేక ప్ర‌శ్న‌లు వేశారు. ఓ జ‌ర్న‌లిస్టు రాజ‌మౌళిపై చేసిన కామెంట్స్ ఆస‌క్తిక‌రంగా మారాయి.

అమ‌ర‌శిల్పి జ‌క్క‌న్న గురించి చ‌రిత్ర‌లో చ‌దువుకోవ‌డ‌మే త‌ప్పించి ఎలా ఉంటాడో ఎవ‌రికీ తెలియ‌ద‌ని, రాజ‌మౌళికి జ‌క్క‌న్న అని ముద్దుగా ఎందుకు పిలుచుకుంటారో ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైల‌ర్ చూస్తేనే అర్ధం అవుతుంది. సినిమాలోని ప్ర‌తి పాత్ర‌ను చ‌క్క‌గా చెక్కి చెక్కి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నార‌ని అన్నారు. మీరున్న ఈ కాలంలో జ‌ర్న‌లిస్టుగా ఉండటం మా అదృష్టం అని ఆ జ‌ర్న‌లిస్టు చెప్ప‌డం విశేషం.

Visitors Are Also Reading