సాధారణంగా ఆరోగ్యం విషయంలో సామాన్య ప్రజలు ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లితే.. అక్కడ వైద్యం సరిగ్గా అందుతుందో లేదోననే అనుమానం ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో మౌళిక వసతులు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే లక్షల బిల్లులు చెల్లించాల్సి వస్తుందనే భయం. ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడికి అడ్డూ అదుపు లేకుండా పోతుందని పేషెంట్లు వాపోతున్నారు. అనారోగ్యం అని వస్తే చాలు.. అందిన కాడికి దోచుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఠాగూర్ సినిమాలాగే చనిపోయిన వ్యక్తిని బతికే ఉన్నట్టు నమ్మించి.. రూ.లక్షల బిల్లులు వేసి మోసం చేసిన ఘటనల గురించి వింటుంటాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వరంగల్ లో వెలుగులోకి వచ్చింది.
Advertisement
ఖిలా వరంగల్ మండలంలోని గాడిపెళ్లి గ్రామానికి చెందిన అఖిల ఇంటర్ వరకు చదవి ఇంట్లోనే ఉంటుంది. ఫిబ్రవరి 23న ఆమెకు విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. నొప్పి భరించలేక పురుగుల మందు తాగింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను హన్మకొండలో ఉన్నటువంటి సిగ్మా హాస్పిటల్ కి తరలించారు. అఖిలను పరిశీలించిన వైద్యులు.. ఆమెను ఐసీయూలో చేర్చారు. వారం రోజుల పాటు ఆమెకు ట్రీట్ మెంట్ అందిస్తున్నట్టు చెబుతూ వచ్చారు డాక్టర్లు. పేషెంట్ ని చూసేందుకు ఒప్పుకోలేదు. మొత్తానికి రూ.16 లక్షల బిల్లు వసూలు చేశారు. మార్చి 02, 2023 గురువారం రోజు అఖిల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
Advertisement
Also Read : అలాంటి రోజు నా లైఫ్ లో రాకూడదు అంటూ వెక్కివెక్కి ఏడ్చిన నాగార్జున.. కారణం ఏంటంటే..?
ఇక పేషెంట్ ని చూడనివ్వకుండా ఏదో ఒక కారణం చెబుతూ కాలం వెల్లదీశారు. పేషెంట్ కుటుంబ సభ్యులు, బంధువులు గట్టిగా నిలదీయడంతో అఖిల చనిపోయిందనే విషయాన్ని వెల్లడించారు. దీంతో ఆగ్రహానికి గురైన బంధువులు.. ఆసుపత్రి బయట ఆందోళన చేపట్టారు. డబ్బుల కోసం ట్రీట్ మెంట్ ఇస్తున్నట్టు నటించారని.. హాస్పిటల్ మేనేజ్ మెంట్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకొని ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా.. చర్యలు తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందాలంటే వారికి ఇబ్బందులు అయితే తప్పడం లేదు.