Home » అకీరా హీరో అవ్వడు అంటూ రేణు దేశాయ్ సంచలన కామెంట్స్.. కానీ అలా మాత్రం చూడాలని ఉంది అంటూ..

అకీరా హీరో అవ్వడు అంటూ రేణు దేశాయ్ సంచలన కామెంట్స్.. కానీ అలా మాత్రం చూడాలని ఉంది అంటూ..

by Srilakshmi Bharathi
Ad

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల కుమారుడు అకిరా నందన్ సినిమా ఎంట్రీ గురించి పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ, అటు రేణు దేశాయ్ కానీ, ఇటు అకిరా కానీ చాలా కాలంగా సినిమాలకు దూరంగానే ఉన్నారు. ఇటీవలే.. టైగర్ నాగేశ్వర్రావు సినిమాలో రేణు దేశాయ్ హేమలత లవణం అనే ఓ ఇంటరెస్టింగ్ రోల్ ను ప్లే చేస్తున్నారు. ఇటీవలే విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు అకిరా నందన్ సినిమా ఎంట్రీ గురించి ప్రస్తావన ఎదురైంది.

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన హీరో కొడుకు వృత్తిపరమైన కెరీర్‌పై ఎల్లప్పుడూ ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారని తెలిసిందే. ఇప్పటివరకు రేణు దేశాయ్ అకిరా నందన్ హీరో గా కెరీర్ ప్రారంభించడు ని చెప్తూ వస్తున్నా సంగతి తెలిసిందే. తాజాగా.. మరోసారి రేణు దేశాయ్ అకీరా కెరీర్ అభిరుచులను గురించి వివరించారు. అకీరానందన్ కు హీరోగా నటించడం ఇష్టం లేదనీ.. అసలు నటనపైనే ఆసక్తి లేదని స్పష్టం చేసారు. మరి ఎలా చూడాలని అనుకుంటున్నారు అని మరో విలేఖరి ప్రశ్నించారు.

Advertisement

తానూ అకీరాను వేల మంది మధ్యలో పియానో వాయిస్తూ ఉంటె చూడాలని ఉందని రేణు దేశాయ్ పేర్కొన్నారు. అకిరా నందన్ పియానో నేర్చుకున్న సంగతి తెలిసిందే. అకీరా సంగీతం మరియు ఫిల్మ్ ప్రొడక్షన్ కోర్సులను అభ్యసిస్తున్నారు. స్క్రిప్ట్‌లు కూడా రాస్తున్నాడు. ప్రస్తుతం తనకు నటుడిగా మారాలనే ఆసక్తి లేదు. పవన్ కళ్యాణ్ గారూ, నేను మా ఆసక్తిని అకిరా పై రుద్దాలని అనుకోవడం లేదు. భవిష్యత్ గురించి నేను చెప్పలేను. అకిరా కు నటన ఆసక్తి ఉంటె అటు వైపు వస్తాడు. లేదంటే నేను ఫోర్స్ చెయ్యను అంటూ రేణు దేశాయ్ స్పషం చేసారు. ప్రస్తుతం రేణు దేశాయ్ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20, 2023న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

మరిన్ని..

రవితేజ మూవీలో రేణుదేశాయ్ పోషించిన హేమలత లవణం పాత్ర గొప్పదనం గురించి తెలుసా ?

ఆస్కార్‌కి అక్షయ్ కుమార్ ‘మిషన్ రాణిగంజ్’ మూవీ..?

Visitors Are Also Reading