Home » జనసేన నుంచి రేణు దేశాయ్ పోటీ.. అందుకే పోస్ట్ పెట్టిందా ?

జనసేన నుంచి రేణు దేశాయ్ పోటీ.. అందుకే పోస్ట్ పెట్టిందా ?

by Bunty
Ad

 

 

రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ రేణు, దేశాయ్ విడాకుల అనంతరం రేణు దేశాయ్ సినిమాలలో పెద్దగా కనిపించలేదు. కేవలం తన పిల్లలను చూసుకుంటూ కుటుంబ బాధ్యతలను తాను ఒక్కతే నిర్వర్తించింది. సినిమాలలో దూరమైనప్పటికీ ఈ మధ్యకాలంలో పలు షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ మధ్య సినిమాలలో మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది రేణు దేశాయ్.

Advertisement

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ సామాజిక కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటారు. ఉన్నట్టుండి రేణు దేశాయ్ ఓ వీడియోతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ… షాకింగ్ కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ ఆశయాలు చాలా గొప్పవి. ప్రజల కోసం పని చేయాలన్న తన కృషి, పట్టుదల చాలా గొప్పది. అతనికి ఒక్క అవకాశం ఇవ్వండి అని ఏపీ ప్రజలను రిక్వెస్ట్ చేసింది రేణు దేశాయ్. అదేవిధంగా తన విషయంలో పవన్ కళ్యాణ్ చేసింది ముమ్మాటికి తప్పే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. రాజకీయాల్లో విమర్శలు చాలా సహజం. కానీ అందులోకి తనని కానీ, తన పిల్లలను కానీ లాగొద్దు అంటూ రిక్వెస్ట్ చేసింది.

Advertisement

పిల్లలను, మహిళలను ఇలాంటి విషయంలో బయటకు లాగొద్దు అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గురించి రేణు దేశాయ్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా రేణు దేశాయ్ పోస్టు పెట్టడంతో… వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆమె పోటీ చేస్తుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. జనసేన పార్టీ తరపున గాజువాక నియోజకవర్గం నుంచి రేణు దేశాయి పోటీ చేస్తారని కొంతమంది అంటున్నారు. అయితే దీనిపై రేణు దేశాయ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి : 

Bholaa Shankar : శ్రీముఖితో చిరంజీవి ఘాటు రొ***న్స్‌..ముసలోడంటూ కామెంట్స్‌ !

Bholaa Shankar Review : భోళా శంకర్ రివ్యూ.. మెగాస్టార్‌ కు షాక్‌ తప్పదా ?

సినిమా నాశనం చేశారు.. చిరంజీవిపై శ్రీరెడ్డి సీరియస్‌ !

Visitors Are Also Reading