Home » Renu Desai : మరోసారి ప్రేమలో పడ్డ రేణు దేశాయ్..ఎవరితో అంటే..?

Renu Desai : మరోసారి ప్రేమలో పడ్డ రేణు దేశాయ్..ఎవరితో అంటే..?

by Bunty

“యానిమల్” ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన విడుదలై బాక్సాఫీస్ రికార్డులను కొల్లగోడుతోంది. కేవలం అతి తక్కువ సమయంలోనే కొన్ని కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ మూవీపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాజిటివ్ గా స్పందించాడు.

Renu Desai fell in love again

అంతేకాకుండా రేణు దేశాయ్ ఈ సినిమాను చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తన ఇన్ స్టాలో భాగంగా ఈ విధంగా రాసుకొచ్చింది. “ఎట్టకేలకు సందీప్ రెడ్డి యానిమల్ సినిమాను చూడాల్సి వచ్చింది. ఈ సినిమా చూసిన అనంతరం నిస్సందేహంగా ప్రేమలో పడ్డాను. ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి.

ఏదైనా ప్రత్యేక అనుభూతులు పొందాలనుకుంటే ఈ సినిమాను థియేటర్లలో చూడటం అస్సలు మిస్ అవ్వకండి” అంటూ రేణు దేశాయ్ రాసుకోచ్చారు. ఇక రేణు దేశాయ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది ఈ విషయంపై పాజిటివ్ గా స్పందిస్తే మరి కొంతమంది నెగటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ఈ వార్తలపై రేణు దేశాయ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading