రేణూదేశాయ్ టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. రేణూ దేశాయ్ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రానించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు జోడీగా రేణూ దేశాయ్ బద్రి, జానీ లాంటి సినిమాల్లో నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బద్రి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ లవ్ లో పడ్డారు. ఆ తరవాత డేటింగ్ లో ఉండగా కొన్నాళ్లకు పెళ్లి చేసుకుని ఒక్కట్టయ్యారు. పవన్ రేణూలకు అఖీరా, ఆద్య ఇద్దరు సంతానం కూడా ఉన్న సంగతి తెలిసిందే.
Advertisement
ఇక పవన్ రష్యాకు చెందిన లెజోనోవాను మూడో వివాహం చేసుకోగా రేణూ దేశాయ్ తో విడాకులు తీసుకున్నారు. ఇక ప్రస్తుతం రేణూ దేశాయ్ రీఎంట్రీ ఇచ్చారు. టీవీ షోలతో పాటూ ఓ సినిమా కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో అన్ని విషయాలను పంచుకుంటారు. అంతే కాకుండా ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.
Advertisement
ఇదిలా ఉండగా పవన్ తో విడాకుల తరవాత రేణూ దేశాయ్ పలు ఇంటర్వ్యూలలో జీవితంలో ఓ తోడు ఉండాలని కామెంట్స్ చేసింది. దాంతో రేణూ దేశాయ్ రెండో వివాహం చేసుకోబోతుంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అంతే కాకుండా ఓ వ్యక్తితో రేణూ దేశాయ్ నిశ్చితార్థం జరిగిందంటూ వార్తలు వినిపించాయి.
ఆ తరవాత రెండో వివాహం పై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక ఇప్పుడు మరోసారి రేణూ దేశాయ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. జీవితంలో అవసరం ఉన్నప్పుడు చేయి పట్టుకుని నడిపించే ఒకతోడు కావాలి అంటూ రేణూ దేశాయ్ పోస్ట్ ను షేర్ చేసింది. దాంతో రేణూ రెండో వివాహం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
ALSO READ :భూమా మౌనికతో రెండో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన మనోజ్..!