మాస మహారాజ రవితేజ మళ్ళీ ప్లాప్స్ దారిలో పడినట్లే కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత గత ఏడాది క్రాక్ సినిమాతో హిట్ అందుకున్నాడు. అందువల్ల వరుస సినిమాలు అనేవి అనౌన్స్ చేసాడు. అయితే అందులో ఒక్క సినిమా అయిన ఖిలాడీ ఈ ఏడాది ఆరంభంలో వచ్చి అభిమానులను నిరాశపరిచింది. అలాగే తాజాగా రామా రావు ఆన్ డ్యూటీతో ఫ్యాన్స్ ముందుకు వచ్చిన రవితేజ ఇక్కడ కూడా అందర్నీ నిరాశపరించాడు.
Advertisement
రామా రావు ఆన్ డ్యూటీ అనే సినిమా మొదటి రోజు మిక్స్డ్ టాక్ అనేది తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ప్లాప్ అని ఫ్యాన్స్ డిసైడ్ చేసారు. అందువల్ల రవితేజకు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ అనేవి వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారంలో ఈ రామా రావు ఆన్ డ్యూటీ అనే సినిమా ప్లాప్ కావడంతో రవితేజ రెమ్యునరేషన్ లో కట్టింగ్ అనేది జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా అనేది ఒప్పుకున్నా తర్వాత రవితేజ సగం రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నాడు.
Advertisement
మిగిలిన సగం రెన్యుమరేషన్ అనేది సినిమా హిట్ అయిన తర్వాత వచ్చే లాభాలో తీసుకుంటాను అని ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ సినిమా అనేది ప్లాప్ టాక్ తెచ్చుకోవడం వల్ల లాభాలు పక్కకు పెడితే.. అసలు పెట్టింది వస్తుందా లేదా అనేది తెలియడం లేదు. అందువల్ల రవితేజకు రావాల్సిన ఆ సగం రెమ్యునరేషన్ అనేది గోవిందా అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ప్లాప్ కావడంతో మళ్ళీ అదే నిర్మాతతో సినిమా చేయడానికి రవితేజ ఒప్పుకున్నాడు అని సమాచారం.
ఇవి కూడా చదవండి :