మెగాస్టార్ చిరంజీవి దసరా పండుగ సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంత చేసుకుంది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. రీమిక్ సినిమా అయినప్పటికీ కథలో చాలా మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక చిరు లూసిఫర్ కంటే ముందు 16 రీమేక్ చిత్రాల్లో నటించారు. ఆ సినిమాలు ఏవి..? వాటి రిజల్ట్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం..
Advertisement
Also Read: రాజమౌళి కెరీర్ లో నష్టాలు వచ్చిన ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా..? అలా ఎందుకు జరిగిందంటే..?
చిరంజీవి మొదటిసారిగా చట్టానికి కళ్లులేవు అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా సట్టం ఒరు ఇరుత్తారై అనే తమిళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. చిరంజీవి కెరీర్ లో పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పట్టణక్కె బంద పత్నియరు అనే తమిళ సినిమాకు రీమేక్ గా తెరెకెక్కింది. చిరంజీవి హీరోగా నటించిన విజేత సినిమా బెంగాలీలో సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా బెంగాలీ చిత్రం సాహెబ్ కు రీమేక్ గా తెరకెక్కింది. చిరంజీవి హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా పసివాడి ప్రాణం పూవిను పుతియా పూంతెన్నల్ అనే మలయాళ సినిమాకు రీమేక్ గా వచ్చింది. చిరంజీవి తెలుగులో సూపర్ హిట్ అయిన అంకుశం సినిమాను బాలీవుడ్ లో ప్రతిభంద్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ సక్సెస్ అవ్వలేకపోయారు. చిరంజీవి హీరోగా నటించిన ఘరానా మొగుడు సినిమా అనురాగ అరళితు అనే చిత్రానికి రీమేక్ గా వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది.
Advertisement
చిరంజీవి సూపర్ హిట్ సినిమా హిట్లర్ ను మలయాళ హిట్లర్ ఆధారంగా తెరకెక్కించారు. చిరు నటించిన స్నేహం కోసం సినిమా ను నట్పుక్కాగ అనే తమిళ సినిమాకు రీమేక్ గా తీశారు. చిరు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఠాగూర్ ను తమిళ సినిమా రమణ కు రీమేక్ గా తెరకెక్కించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాను బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు.
చిరంజీవి హీరోగా నటించిన రాజా విక్రమార్క అనే సినిమా కమింగ్ టు అమెరికా అనే ఇంగ్లీష్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. చిరంజీవి బాలీవుడ్ లో నటించిన మరో సినిమా ది జెంటిల్మెన్. ఈ సినిమా తెలుగు, తమిళ్ లో సూపర్ హిట్ అయింది. ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేయగా ఫ్లాప్ అయ్యింది.
చిరంజీవి హీరోగా లగే రహో మున్నాభాయ్ అనే సినిమాను శంకర్ దాదా జిందాబాద్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన వాల్తేర్ వెట్రివల్ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి హీరోగా ఎస్పీ పరశురామ్ పేరుతో రీమేక్ చేశారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా ఖైదీ నెంబర్ 150 పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళ మూవీ కడలోర్ కవిదైగళ్ ను తెలుగులో ఆరాధన పేరుతో చిరంజీవి రీమేక్ చేశారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.
Also Read: సినిమాల్లో వచ్చిన ఒకటి రెండు సీన్స్ కోసం మళ్లీ మళ్లీ చూడాలనిపించే 5 సినిమాలు ఇవే..?