Home » టాలీవుడ్ లోని ఈ సెలబ్రిటీలు దగ్గరి బంధువులు కూడా….!

టాలీవుడ్ లోని ఈ సెలబ్రిటీలు దగ్గరి బంధువులు కూడా….!

by AJAY
Ad

టాలీవుడ్ లో ఎంతోమంది నటీనటులు టెక్నీషియన్స్ మధ్య బంధుత్వాలు ఉన్నాయి. అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇలా రకరకాల బంధుత్వాలు ఉన్నాయి. కానీ చాలామందికి సెలబ్రిటీల బంధుత్వాల గురించి ప్రేక్షకులకు తెలియదు. కాబట్టి ఇండస్ట్రీలో ఎవరెవరి మధ్య ఎలాంటి బంధుత్వాలు ఉన్నాయి అన్నది ఇప్పుడు చూద్దాం….

Advertisement

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గురించి తెలిసిందే. సందీప్ కిషన్ మరెవరో కాదు ప్రముఖ కెమెరామెన్ చోటా కె నాయుడు మేనల్లుడు.

మ్యాచో మాన్ గోపీచంద్ కు శ్రీకాంత్ బాబాయ్ అవుతారు. శ్రీకాంత్ మేనకోడలిని గోపిచంద్ వివాహం చేసుకున్నారు.

విశ్వనటుడు కమల్ హాసన్ సహజ నటి సుహాసిని ల మధ్య కూడా బంధుత్వం ఉంది. సుహాసినికి కమల్ హాసన్ సొంత బాబాయ్ అవుతాడు.

Advertisement

కళాతపస్వి కె.విశ్వనాథ్ నటుడు చంద్రమోహన్ కజిన్స్ అవుతారు. అందువల్లే చంద్రమోహన్ ను విశ్వనాథ్ ఎక్కువగా ప్రోత్సహించారు..

బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ అదేవిధంగా హీరోయిన్ ప్రియమణి కూడా కజిన్స్ అవుతారు.

హీరో రామ్ పోతినేని శర్వానంద్ కూడా బంధువులే. రామ్ పోతినేని కి శర్వానంద్ వరుసకు బావ అవుతాడు. శర్వానంద్ అన్న మరియు రామ్ పోతినేని సోదరి భార్య భర్తలు.

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ శ్రీహరి మధ్య కూడా దగ్గరి బంధుత్వం ఉంది. ప్రకాష్ రాజ్ మొదటి భార్య శ్రీహరి భార్య ఇద్దరూ సొంత అక్క చెల్లెలు.

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ మరియు నటుడు పోసాని కృష్ణ మురళి కూడా బంధువులు అవుతారు. కొరటాల శివకు పోసాని కృష్ణమురళి సొంత మేనమామ అవుతారు.

Visitors Are Also Reading