Home » బిగ్ బాస్ విన్నర్ సన్నీ ఎన్టీఆర్ మధ్య రిలేషన్ ఏంటి..?

బిగ్ బాస్ విన్నర్ సన్నీ ఎన్టీఆర్ మధ్య రిలేషన్ ఏంటి..?

by AJAY

బిగ్ బాస్ సీజన్ -5 లోకి అడుగుపెట్టిన సన్నీ విజేతగా నిలిచాడు. 15 వారాల పాటు సాగిన బిగ్ బాస్ హోరా హోరీ పోటీలో బెస్ట్ ఎంటర్టైనర్ గా గుర్తింపు తెచ్చుకుని ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. మొదటి వారం నుండి మెల్లిమెల్లిగా పదిహేను వారాలపాటు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలా విజే సన్నీ బిగ్ బాస్ టైటిల్ విజేతగా నిలిచాడు. నిజానికి సన్నీ తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో పైకి వచ్చాడు. మొదట న్యూస్ ఛానల్ లో ఫేజ్ 3 జర్నలిస్ట్ గా తన కెరియర్ ను ప్రారంభించాడు.

Ntr vj sunny

Ntr vj sunny

ఆ తర్వాత మా మ్యూజిక్ లో సంథింగ్ స్పెషల్ అనే టీవీ షో ద్వారా ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత మెల్ల మెల్లగా సీరియల్ అవకాశాలను అందుకున్నాడు. కల్యాణ వైభోగమే సీరియల్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటిస్తున్న సన్నీ బిగ్ బాస్ అవకాశం రావడంతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లో కూడా మొదటి నుండి తన టాలెంట్ ను ప్రదర్శిస్తూ కొత్త అభిమానులను సైతం సంపాదించుకున్నాడు. అయితే ఓట్ల విషయంలో అతని ఫ్యాన్స్ తో పాటు ఎన్టీఆర్ అభిమానుల సపోర్ట్ కూడా అందింది.

దానికి కారణం గతంలో సన్నీ ఓ సందర్భంలో ఎన్టీఆర్ తో సరదాగా ముచ్చటించారు. దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోయారు. ఆ ఫోటో కాస్తా వైరల్ అయింది. అంతేకాకుండా సన్నీ సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో అతడిని బుల్లితెర ఎన్టీఆర్ అంటూ పలువురు పిలిచేవారట. అలా పిలవడం సన్నీకి కూడా ఎంతో ఇష్టం ఈ విషయం కాస్తా సన్నీ హౌస్ లో ఉన్న సమయంలో ఎన్టీఆర్ అభిమానులకు తెలిసింది. అలా ఎన్టీఆర్ అభిమానులు సైతం సన్నీకి పెద్ద మొత్తంలో ఓట్లు వేసినట్టు తెలుస్తోంది.

Also Read: బిగ్ బాస్ నుండి భారీ రెమ్యునేషన్ పుచ్చుకున్న సిరి హన్మంత్…ఎంతంటే…?

Visitors Are Also Reading