Home » ఒక‌ప్పటి అమ్మాయిల డ్రీమ్ బాయ్ రాజా ఎన్టీఆర్ కు అంత ద‌గ్గ‌రి బంధువా…ఏమ‌వుతారంటే?

ఒక‌ప్పటి అమ్మాయిల డ్రీమ్ బాయ్ రాజా ఎన్టీఆర్ కు అంత ద‌గ్గ‌రి బంధువా…ఏమ‌వుతారంటే?

by AJAY
Ad

సినీ ప‌రిశ్ర‌మ‌లో ఒకే  పేరుతో చాలా మంది న‌టీన‌టులు ఉన్న విష‌యం తెలిసిందే. రామారావు, స‌త్య‌నారాయ‌ణ‌, జ‌య‌ల‌లిత, బాల‌కృష్ణ‌, న‌రేష్‌, సుధాక‌ర్ ఇలా ఒకే పేరుతో అనేక మంది నటీనటులు సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఆనంద్ రాజా అనే నటుడు కూడా ఉన్నాడు . కానీ 1980 లో ఒక రాజాగా ఉండేవాడు. ఈయన పేరు చెబితే ఆనాటి అమ్మాయిలు మత్తెక్కిపోయి వాళ్ళు. అలాంటి డ్రీమ్ బాయ్‌ను  దాసరి నారాయణరావు వెండితెరకు పరిచయం చేశారు. ఈయన నటించిన స్వప్న చిత్రం ఆనాటి యువతను ఒక ఊపు ఊపింది.

Advertisement

1980 శ్రీ లలిత ఎంటర్ప్రైజెస్ దాసరి నారాయణరావు దర్శకత్వంలో స్వప్న అనే చిత్రము విడుదలయ్యింది. స్వప్న అనే నటి ఈ సినిమాతోనే హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయింది. ప్రముఖ సంగీత దర్శకులు చెళ్ళపిళ్ళ సత్యం అందించగా.. అంకితం నీకే అంకితం నూరేళ్ళ ఈ జీవితం అనే పాట ఎస్పీ బాలసుబ్రమణ్యం గొంతులో నుంచి జాలువారింది. ఈ గీతాన్ని స్వయంగా దాసరి నారాయణరావు రచించారు. దాసరి రాసిన పలు గీతాల్లో ఈ పాటకు ఎంతగానో పేరు వచ్చింది. ఆనాటి ప్రేమికులను స్వప్న చిత్రం ఆకట్టుకుంది. అప్పటి స్టార్స్ అయినటువంటి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ శోభన్ బాబు వంటి చిత్రాలతో పోటీపడి ఈ సినిమా ఘనవిజయం సాధించింది.

పలు చిత్రాలలో రాజా యంగ్ హీరోగా నటించాడు. ఆ తర్వాత అప్పటి హీరోల చిత్రాల్లో రాజా సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా నటించారు. అకస్మాత్తుగా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో రాజా బుల్లి తెర వైపు మొగ్గు చూపారు. ఆ క్రమంలో ప్రముఖ బుల్లితెర దర్శకురాలు మంజులానాయుడు దర్శకత్వం వహించిన దూరదర్శన్లో ప్రసారమయ్యే ఋతురాగాలు ధారావాహిక  యాక్టర్ గా చేశాడు .

Advertisement

అకస్మాత్తుగా గుండెపోటు తో మరణించాడు ఆయ‌న‌కు ఎక్కువగా కన్నడ మూలాలు ఉన్నాయి ఈ విషయానికి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్ ఎంతటి స్టార్ హీరో నో మనందరికీ తెలిసిందే. హరికృష్ణ రెండో భార్య శాలిని కి జన్మించారు. ఈమె ఓ ప్రముఖ టెలిఫోన్  ఎక్సైంజ్  కంపెనీ లో పని చేసేటప్పుడు హరికృష్ణ తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి పెళ్లికి దారి ఇది దారితీసింది. హరికృష్ణ తండ్రి ఎన్టీఆర్ కూడా ఈ వివాహానికి ఒప్పుకోలేదు. తర్వాత శాలినిని, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను ద‌గ్గ‌రికి తీశారు సీనియ‌ర్ ఎన్టీఆర్‌. కర్ణాటకకు చెందిన శాలిని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.  హైద‌రాబాద్‌లో తొలుత  న‌ల్ల‌కుంట శంక‌ర్ మ‌ఠం వ‌ద్ద‌ నివాసం ఉండేది.  కొన్ని అనివార్య కారణాలవల్ల మెహిదిప‌ట్నం మారిందని చెబుతారు చాలాకాలం హరికృష్ణ వివాహం రహస్యంగానే ఉండేది.  జూనియర్ ఎన్టీఆర్ త‌ల్లి శాలిని  విషయానికి వస్తే ఆమె నటి రాధ హీరోయిన్ అంటే శాలిని సోదరిని రాజా వివాహం చేసుకున్నారు.

ALSO READ : ‘దమ్ముంటే ఇప్పుడు ట్రోల్ చేయి పవన్ కళ్యాణ్’ అంటూ పవన్ ని ఆడుకుంటున్న నెటిజన్స్ !

ఆయన జూనియర్ ఎన్టీఆర్ కు  బాబాయ్ అవుతాడు ఒకవేళ రాజా ఉంటే ఎన్టీఆర్ ఇంకో  స్థాయిలో ఉండేవారేమో అని ప‌లువురు పేర్కొంటుంటారు. ఇప్పుడూ కూడా జూ.ఎన్టీఆర్ ప‌లు అగ్ర సినిమాల్లో న‌టిస్తూ ఓ వెలుగు వెలుగుతున్న విష‌యం తెలిసిందే. అల‌నాటి రాజా తెలుగు ప్రేక్ష‌కుల‌కు భౌతికంగా దూర‌మైన‌ప్ప‌టికీ బుల్లి తెర‌లో ఆయ‌న న‌టించిన నటించిన సినిమాలు అప్పుడప్పుడు ప్రసారం కావడంతో ఇంకా ఆయన ప్రజల గుండెల్లో పదిలంగా ఉండిపోయారు.

Visitors Are Also Reading