Home » రాజీవ్ గాంధీ హత్యకు మురారి సినిమాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా…!

రాజీవ్ గాంధీ హత్యకు మురారి సినిమాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా…!

by AJAY
Published: Last Updated on
Ad

దర్శకులు సినిమా కథలను ఎక్కడి నుండో తీసుకురారు. తమ జీవితంలో అనుభవించిన‌వి…. లేదా చూసినవి… లేదా విన్న వాటినే కథలుగా రాసుకుని వాటిని సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. అయితే దర్శకుడు తీసుకున్న కాన్సెప్ట్ ను కథగా ఎలా మలిచారు అన్నదే సినిమా విజయం పై ఆధారపడి ఉంటుంది. సినిమాకు బ‌లం బ‌ల‌హీన‌త రెండూ కూడా క‌థ‌నే.

murari-movie

murari-movie

 

కాగా మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మురారి సినిమా కథను కూడా దర్శకుడు కృష్ణవంశీ తాను సరదాగా జరిపిన ఓ చిట్ చాట్ నుండి ఎంచుకున్నారట. మురారి సినిమా నిర్మాత నందిగామ రామలింగేశ్వర రావు. ఈయనకు సూపర్ స్టార్ కృష్ణకు మంచి అనుబంధం ఉంది. దాంతో మహేష్ బాబు తో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని నిర్మాత ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యం లోనే మంచి కథను సిద్ధం చేయాలని కృష్ణవంశీకి నిర్మాత సూచించారు. దాంతో కృష్ణవంశీ కథను వెతికే పనిలో పడ్డారు.

Advertisement

Advertisement

ఈ క్రమంలో కృష్ణవంశీ ఓ రోజు గోదావరిలో బోటు ప్రయాణం చేస్తున్నారు. ఆ సమయంలో కృష్ణవంశీ తో పాటు ఆయుర్వేద డాక్టర్ గున్నేశ్వరారవు కూడా ఉన్నారు. కృష్ణవంశీ కిఓ సందేహం రావ‌డంతో వెంట‌నే డాక్టర్ తో మాట్లాడుతూ ఫిరోజ్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ ఇలా ఒకే కుటుంబంలో ఎందుకు చిన్నవయసులోనే మృతి చెందుతున్నారంటూ ప్రశ్న వేశాడు. దాంతో ఆయుర్వేద డాక్టర్ అది వాళ్ల కుటుంబానికి పట్టిన శాపం అని చెప్పారు. అనంతరం డాక్టర్ శాపం గురించి చెబుతూ తమ‌ ఊరిలో జరిగిన ఓ నిజ‌ సంఘటనను కూడా కృష్ణ వంశీకి చెప్పారు.

ఆ రెండు విషయాలు విన్న తర్వాత కృష్ణవంశీకి రాత్రి నిద్ర కూడా పట్టలేదు. అయితే అప్పటికే మహేష్ బాబు కోసం కృష్ణవంశీ బృందావనంలో కృష్ణుడు అనే కాన్సెప్ట్ లో సినిమా చేయాలని అనుకున్నాడట. ఇక ఆ సమయంలో ఆ కథకు శాపం కాన్సెప్ట్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించిందట. అదే విషయాన్ని నిర్మాతకు చెప్ప‌డంతో ఆయ‌న ఇంప్రెస్ అయ్యారు. ఇక ఈ సినిమా క‌థ‌ను సిద్దం చేసి కృష్ణ, మహేష్ బాబుల‌కు సైతం కృష్ణ వంశీ చెప్పేశారు. క‌థ న‌చ్చ‌డంతో వాళ్లు వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ అచ్చారు. అలా మురారి సినిమా తెర‌పైకి వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

ALSO READ :

హీరో సుమన్ పెళ్ళిలో చిరంజీవి సందడి…..వైరల్ అవుతున్న ఫోటోలు…!

Visitors Are Also Reading