లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి గారి గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిన్నటి తరంలో తిరుగులేని తారగా వెలుగొందిన ఆమెకు నందమూరి ఫ్యామిలీతో ప్రత్యేక అనుబంధం ఉంది. కొన్నాళ్ళు రాజకీయాలలో కొనసాగినా కూడా తాజాగా సినిమా రంగంలోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చారు. సరిలేరు నీకెవ్వరులో కీలక పాత్ర పోషించి తన నటనా సామర్ధ్యాన్ని మరోసారి చూపించారు.
Advertisement
విజయశాంతి గారి భర్త శ్రీనివాస ప్రసాద్ గురించి చాలా తక్కువమందికి తెలుసు. సగటు అమ్మాయిల పాత్రల నుంచి యాక్షన్ సన్నివేశాలను కూడా అలవోకగా నటించి లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతిగారి పర్సనల్ లైఫ్ గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. కెరీర్ మొదటిలో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అయినా, క్రమంగా యాక్షన్ సన్నివేశాలలో కూడా సత్తా చాటింది. బాలకృష్ణ, చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణలతో ఎక్కువ సినిమాలు చేసిన విజయశాంతి దాదాపు నలభై ఏళ్లుగా సినీరంగంలో కొనసాగుతున్నారు.
Advertisement
కెరీర్ టాప్ పొజిషన్లో ఉండగానే విజయశాంతి శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆయనకు నందమూరి ఫ్యామిలీకి చుట్టరికం ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయన ఎన్టీఆర్ పెద్ద అల్లుడు అయిన గణేష్ రావు కు మేనల్లుడు అవుతారు. హీరో బాలకృష్ణతో శ్రీనివాస్ ప్రసాద్ మంచి స్నేహ బంధం కూడా ఉంది. వీరి బంధం కెరీర్ లో కూడా ముందుకెళ్లింది.
శ్రీనివాస్ ప్రసాద్ బాలకృష్ణతో కలిసి యువరత్న ఆర్ట్స్ ను స్థాపించి “నిప్పు రవ్వ” సినిమాకు కూడా తెరకెక్కించారు. కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా విజయశాంతి నటించారు. ఆమెను హీరోయిన్ గా అడగడానికి శ్రీనివాస ప్రసాద్ గారే వెళ్లారు. ఈ క్రమంలోనే వీరి మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమగా చిగురించి పెళ్లి వైపు అడుగులు వేసేలా చేసింది.
మరిన్ని ముఖ్య వార్తలు:
అచ్చం రాజశేఖర్ లానే ఉన్న ఈ హీరో ఎవరో ఎవరో తెలుసా..? ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటంటే…?
Asia Cup 2023 : ఆసియాకప్ వేదికలు ఖరారు… శ్రీలంకలో టీమ్‌ఇండియా మ్యాచులు!
అప్సర కేసులో ట్విస్ట్…సీన్ లోకి కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఆడియో !