టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్న తొలి నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు (83) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నారు. అనారోగ్యంతో ఉండడంతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 3.25 గంటలకు ఆయన కన్నుమూసినట్టు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
Advertisement
కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు 1940 జనవరి 20న జన్మించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. దాదాపు 200 చిత్రాలకు పైగా రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించారు. కొన్ని దశాబ్దాలు టాలీవుడ్‌ని ఏలాడు రెబల్ స్టార్ కృష్ణం రాజు. తొలుత 1966 లో ‘చిలుకా గోరింక’ చిత్రంలో చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎన్టీఆర్‌తో 7, ఎన్నార్ తో 5, శోభన్ బాబుతో 8, కృష్ణతో 21 సినిమాల్లో కలిసి నటించారు. ‘అవేకళ్లు’ చిత్రంలో విలన్ గా కూడా నటించారు కృష్ణంరాజు. కృష్ణంరాజును రెబల్ స్టార్‌గా నిలిపిన సినిమా కటకటాల రుద్రయ్య. రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి బిల్లా, రెబల్, రాధేశ్యామ్ సినిమాల్లో నటించారు. కృష్ణంరాజుని ప్రభాస్ గత శనివారం కలిసి వెళ్లారు.
Advertisement
ఇది కూడా చదవండి : మనోజ్ ఫస్ట్ పెళ్లి భూమా మౌనికతో జరగాలట.. కానీ ఆ కారణం వల్ల వద్దన్నారంటా..!
1989లో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి.. ఆ తరువాత భారతీయ జనతా పార్టీ నుంచి 12వ లోక్ సభ ఎన్నికల్లో 1998లో కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక 13వ లోక్ సభకు కూడా నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రి వర్గంలో స్థానం సంపాదించాడు. మార్చి 2009లో బీజేపీని వీడి మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇక ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. మళ్లీ బీజేపీలో చేరి కీలక నేతగా పేర్గాంచాడు. ప్రభాస్ బాహుబలి హిట్ అయిన సందర్భంలో కృష్ణంరాజుతో కలిసి ప్రభాస్ ప్రధానిని కలిశారు. కృష్ణంరాజు మృతి సినీ రంగానికి తీరని లోటని కృష్ణంరాజు ఫాన్స్ గౌరవ సలహాదారుడు జొన్నలగడ్డ శ్రీరామచంద్ర శాస్త్రీ తెలిపారు.
ఇది కూడా చదవండి : రక్తంతో తన పెయింటింగ్ చూసి సోనూసూద్ ఏం చేసాడో తెలుసా..?