టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్. మిగితా దర్శకుల సినిమాల కంటే సుకుమార్ ఎంచుకునే కథలు ఆయన తీసే సన్నివేశాలు చాలా భిన్నంగా ఉంటాయి. అందువల్లే సుకుమార్ సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతాయి. సుకుమార్ తీసిన సినిమాలలో ఎక్కువ హిట్స్ ఉండటంతో ఆయన తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు అస్సలు ఆలోచించరు. ఆర్య,ఆర్య-2 లాంటి సినిమాలతో సుకుమార్ ఫ్రెష్ ప్రేమ కథలను ప్రేక్షకులకు చూపించారు. రంగస్థలం, పుష్ప లాంటి డిఫరెంట్ మాస్ కథలతో ప్రేక్షకులను మెప్పించారు.
Advertisement
సుకుమార్ ఎన్టీఆర్ తో చేసిన నాన్నకు ప్రేమతో సినిమాకు కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. కానీ ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేకపోయింది. అయితే సుకుమార్ కెరీర్ లో ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి బోల్తా కొట్టిన సినిమా మహేశ్ బాబు నేనొక్కడినే….ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. ఈ సినిమా సెంటిమెంట్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కింది.
Advertisement
సినిమా ట్రైలర్, టీజర్ లలో మహేశ్ బాబు గత సినిమాల కంటే అందంగా కనిపించారు. ట్రైలర్ లోని సీన్లు కేక పుట్టించాయి. కానీ సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది. కాగా తాజాగా ఈ సినిమా విజయం సాధించకపోవడానికి గల కారణాలను సుకుమార్ శిష్యుడు దర్శకుడు హరిప్రసాద్ వెల్లడించారు. సుకుమార్ వల్లనే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని హరిప్రసాద్ చెప్పారు. నేనొక్కడినే సినిమా కథను ముందే తాను కూడా విన్నానని చెప్పారు. నేనొక్కడినే హిట్ ఫ్లాప్ పక్కన పెడితే సినిమా ట్రైలర్ జేమ్స్ బాండ్ రేంజ్ లో ఉంటుందని చెప్పారు.
యాక్షన్ సీన్లు ఆ విధంగా ఉంటాయని చెప్పారు. కానీ థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకుడికి సైకలాజికల్ పేషెంట్ అయిన హీరో కథను చూపించారని అన్నారు. దాంతో ప్రేక్షకులు మొదటి షో తో కన్ఫ్యూజ్ అయ్యారని అన్నారు. కానీ ఆ తరవాత సినిమా ప్రేక్షకులకు నచ్చిందని చెప్పారు. మొదటి షోతో ఫ్లాప్ టాక్ రావడంతో అదే కంటిన్యూ అయ్యిందన్నారు. తాము సినిమాను సైకలాజికల్ థ్రిల్లర్ గా ప్రమోట్ చేసి ఉంటే రిజల్ట్ వేరుగా ఉండేదని అన్నారు.
ALSO READ :
“ఒక్కడు” సినిమా కి హీరోగా మొదటి చాయిస్ మహేష్ కాదట ! మరెవరో తెలుసా ?
సావిత్రి పక్కన కూర్చోవడానికి కూడా ఎందుకు వణికిపోయేవారు ? తన మొదటి సినిమాతోనే ఆస్తులల్ని అమ్మేసి ..!