Home » “ఒక్కడు” సినిమా కి హీరోగా మొదటి చాయిస్ మహేష్ కాదట ! మరెవరో తెలుసా ?

“ఒక్కడు” సినిమా కి హీరోగా మొదటి చాయిస్ మహేష్ కాదట ! మరెవరో తెలుసా ?

by AJAY

Mahesh Babu Okkadu Movie: సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబును స్టార్ హీరోగా నిల‌బెట్టిన సినిమా ఒక్క‌డు. గుణ‌శేఖ‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో మ‌హేశ్ బాబుకు జోడీగా భూమిక హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాతో భూమిక‌కు కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు వ‌చ్చింది. 2003 జ‌న‌వ‌రి 15న ఈ సినిమా విడుద‌లైంది. ఈ సినిమాలో ప్ర‌కాష్ రాజ్ విల‌నిజం మ‌హేశ్ బాబు హీరోయిజం హైలెట్ గా నిలిచాయి.

Mahesh Babu Okkadu Movie

Mahesh Babu Okkadu Movie

 

క‌బ‌డ్డి బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చిన ఈ సినిమా యూత్ ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. సినిమాలో మాస్ ఎలివెంట్స్ ల‌వ్ తో పాటూ కామెడీ కూడా న‌వ్వులు పూయిస్తుంది. ప్ర‌కాష్ రాజ్ చెప్పే డైలాగులు థియేట‌ర్ లో విజిల్స్ కొట్టించాయి. గుణ‌శేఖ‌ర్ సినిమాలంటే భారీ సెట్స్ ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. దాంతో సినిమాకు బ‌డ్జెట్ కూడా ఎక్కువ అవుతుంద‌ని అనుకున్నారు. అప్ప‌టికి మ‌హేశ్ బాబు మురారి సినిమా విడుద‌ల కాలేదు.

రాజ‌కుమారుడు సినిమా మాత్రం హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం కథా ర‌చ‌యిత వెల్ల‌డించారు. నిర్మాత ఎం ఎస్ రాజు మ‌హేశ్ బాబుకు తో ఓ సినిమా చేసేందుకు వెళ్లిన‌ప్పుడు ఒక్క‌డు క‌థ‌ను కూడా వినిపించార‌ట‌. మ‌హేశ్ బాబుకు ఒక్క‌డు క‌థ న‌చ్చి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. అయితే అప్ప‌ట్లో మ‌హేశ్ బాబుకు శాక‌మూరి రాంబాబు అనే మేనేజెర్ ఉండేవార‌ట‌.

గుణ‌శేఖ‌ర్ ఒక్క‌డు సినిమా కోసం మ‌హేశ్ బాబును సంప్ర‌దించే స‌మ‌యంలో మేనేజ‌ర్ ఫోన్ తీసేవారు కాద‌ట‌. లేదంటే బాబు ప‌డుకున్నారు అంటూ ఏదో ఒక రీజ‌న్ చెప్పేవార‌ట‌. దాంతో మ‌హేశ్ బాబు సినిమా చేస్తారా ఆయ‌న‌కు ఆస‌క్తి ఉందా లేదా అని మైక‌ర్స్ దైల‌మాలో ప‌డిపోయార‌ట‌. త‌ర‌వాత ఇదే క‌థను ప‌వ్ క‌ల్యాణ్ లేదా వెంక‌టేష్ ల‌తో చేస్తే ఎలా ఉంటుంద‌ని ఆలోచ‌న చేశార‌ట‌. అలా దైలామాలో ఉన్న స‌మ‌యంలోనే మ‌హేశ్ బాబు ఫోన్ చేసి ఒక్క‌డు తానే చేస్తాన‌ని చెప్పార‌ట‌.

ALSO READ : 

సావిత్రి పక్కన కూర్చుకోవడనికి కూడా ఎందుకు వణికిపోయారు ? ఒక్క సినిమాతో ఆస్తులని అమ్మేసి..!

ఆర్ఆర్ఆర్ కు మించిన స్థాయిలో అప్పట్లో వచ్చిన ఎన్టీఆర్ సినిమా అదేనా ??

 

Visitors Are Also Reading