వడ్డె నవీన్ ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న హీరో. ఆయన ఎంత త్వరగా ఇండస్ట్రీలో పేరు సంపాదించారో అంత ఫాస్ట్ గా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. దానికి ప్రధాన కారణం ఏమిటో తెలుసుకుందాం..!
వడ్డె నవీన్ ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ కుమారుడు. నవీన్ కోరుకున్న ప్రియుడు అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా అంతగా విజయం సాధించక పోయినా సరే నవీన్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆయన జీవితంలో హీరోగా మంచి విజయం అందుకున్న చిత్రం పెళ్లి. ఈ మూవీతో ఆయన సినీ జీవితంలోనే భారీ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు.
Advertisement
ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మనసిచ్చి చూడు, ప్రేమించే మనసు, చాలా బాగుంది సినిమాలు చేసి విజయం సాధించారు. ఈ విధంగా తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్న వడ్డే నవీన్ దాన్ని కొనసాగించడంలో విఫలం అయ్యాడు. ఎంత తొందరగా స్టార్ హీరోగా ఎదిగాడో అంతే తొందరగా కెరియర్ పరంగా డౌన్ అయ్యాడు. సుమారుగా 28 సినిమాల్లో హీరోగా నటించి హీరోగా తన కెరీర్ ముగియడంతో తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రెండు మూడు సినిమాల్లో నటించాడు. హీరో గా రాణించినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించలేక పోయారు. ఆయన జీవితం ఈ విధంగా ఉండగానే నందమూరి తారకరామారావు గారి కుమారుడు అయినా రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని వివాహం చేసుకున్నాడు.
Advertisement
వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ కి నందమూరి కుటుంబానికి చాలా రోజుల నుంచే సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. దీనివల్లనే ఈ వివాహం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడిపోయారు. ఈ ప్రభావం ఆయన సినిమా కెరీర్ పై చాలా ఎఫెక్ట్ చూపించిందని కొంతమంది చెబుతూ ఉంటారు. కానీ ఇవేవీ నిజం కావని చాముండేశ్వరితో విడాకులు అయిపోయిన తర్వాత వడ్డే నవీన్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. ఆయన చివరిగా కనిపించిన సినిమా 2016 లో వచ్చిన ఎటాక్ సినిమా. ఈ మూవీ తర్వాత ఆయన మరో సినిమాలో నటించలేదు. ఈ విధంగానే సినిమాలకు దూరమై పోయాడు అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి :
జయమ్మ పంచాయతీ ట్రైలర్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
‘కేజీఎఫ్ చాప్టర్ 3’ గురించి మరిచిపోండి… ఎందుకంటే..?