Ad
ప్రస్తుతం ఇండియా – సౌత్ ఆఫ్రికా మధ్య 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సేరి లో భాగంగా నిన్న జరిగిన మొదటి మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోయింది. కానీ ఇందులో భారత ఓటమి కంటే హార్దిక్ పాండ్య చేసిన ఓ పనే ఎక్కువ వివాదాస్పదమైంది. అయితే ఈ మ్యాచ్ లో ఆఖరి ఓవర్ లో బ్యాటింగ్ కు వచ్చాడు దినేష్ కార్తీక్. ఐపీఎల్ 2022 లో బెంగళూర్ జట్టుకు మంచి ఫినిషర్ గా రాణించిన కార్తీక్ టీం ఇండియాకు కూడా అలానే అడవుతాడు అని అందరూ అనుకున్నారు. ఇక దినేష్ బ్యాటింగ్ కు వచ్చిన తర్వాత ఎదుర్కొన మొదటి బంతికి సింగిల్ తీసాడు.
ఆ తర్వాత పాండ్య స్ట్రైకింగ్ లోకి వచ్చాడు. అప్పుడు పాండ్య ఓ సిక్స్ కొట్టిన తర్వాత మరో బంతికి సింగిల్ వచ్చే అవకాశం ఉన్న తీయడానికి నిరాకరించాడు. దాంతో అతని పై చాలా విమర్శలు వచ్చాయి. అక్కడ ఉనన్ది టేలెండర్ కాదని.. ఓ బెస్ట్ ఫినిషర్ అని.. అతనికి నువ్వు స్ట్రైకింగ్ ఎందుకు ఇవ్వలేదు అని భారత మాజీ ఆటగాళ్లు, అభిమానులు చాలా మంది ప్రశ్నించారు. ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్ గెలిచినా తర్వాత పాండ్యకు పొగరు పెరిగిందని అన్నారు. కానీ దీని వెనుక మరో కారణం ఉంది అని తెలుస్తుంది.
అదేంటంటే.. 2019 లో న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు జరిగిన టీ20 మ్యాచ్ లో టీం ఇండియా విజయాన్ని చివరి ఓవర్ లో 16 పరుగులు కావాలి. అప్పుడు దినేష్ తో పాటు కృనాల్ పాండ్య స్ట్రైకింగ్ లో ఉన్నారు. అయితే ఆ ఓవర్ మొదటి బంతికి కృనాల్ సింగిల్ తీసి దినేష్ కు బ్యాటింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత రెండు బంతులకు సింగిల్ వచ్చే అవకాశం ఉన్న దినేష్ తీయలేదు. నాలుగో బంతికి సింగిల్ తీయగా.. మళ్ళీ కృనాల్ సింగిల్ తీసాడు. ఇక ఆఖరి బంతికి దినేష్ సిక్స్ కొట్టినా.. భారత జట్టు 4 పరుగులతో ఓడిపోయింది. కానీ అప్పుడు దినేష్ తన అన్న పాండ్యకు చేసిన అవమానానికే ఇప్పుడు తమ్ముడు పాండ్య రివెంజ్ తీసుకున్నాడు అని ప్రచారం జరుగుతుంది.
ఇవి కూడా చదవండి :
నేను ఆడితే భారత్ ప్రపంచ కప్ గెలిచేది కాదు..!
ఉత్తరాఖండ్ ఆటగాళ్లకు అన్యాయం చేస్తున్న ఆ రాష్ట్ర బోర్డు..!
Advertisement