Home » ఉత్తరాఖండ్ ఆటగాళ్లకు అన్యాయం చేస్తున్న ఆ రాష్ట్ర బోర్డు..!

ఉత్తరాఖండ్ ఆటగాళ్లకు అన్యాయం చేస్తున్న ఆ రాష్ట్ర బోర్డు..!

by Azhar
Ad

ప్రపంచ లో ఉన్న అన్ని దేశాల క్రికెట్ బోర్డుల కంటే మన బీసీసీఐ చాలా ధనిక వంతమైన బోర్డుగా చాలా పేరు ఉంది. కానీ ఆ పేరుకు తగ్గట్లు బోర్డు మాత్రం నడుచుకోవడం లేదు. తమ ఆటగాళ్లకు జరుగుతున్న అన్యాయం మాత్రం గుర్తించడం లేదు. ఆటగాళ్లకు డబ్బులు ఇవ్వకుండా వారి పేరుతో కోట్లు వెనుకేసుకుంటున్న రాష్ట్ర క్రికెట్ బోర్డు పైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అయితే అది ఏ రాష్ట్ర బోర్డు అనుకుంటున్నారా… ఉత్తరాఖండ్. ఇక్కడ బోర్డు ఆటగాళ్లకు చాలా అన్యాయం చేస్తుంది.

Advertisement

మాములుగా రాష్ట్రానికి ఆడే ఆటగాళ్లకు డేలీ అలవెన్స్ కింద మ్యాచ్ ఫీజులు, జీతాలు కాకుండా కనీసం 1500 రూపాయలు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఉత్తరాఖండ్ బోర్డు ఇస్తుంది మాత్రం కేవలం 100 రూపాయలు మాత్రమే. అలాగే ఆటగాళ్లకు ఇవ్వాల్సిన జీతాలు, ఫీజులు కూడా సరిగ్గా ఇవాడకుండా మొత్తం డ్యూ ఉంచుతుంది. ఈ బోర్డు మరి ఎంతలా ప్రవర్తిస్తుంది అంటే ఆటగాళ్లకు భోజనం కూడా పెట్టడం లేదు. అడిగితే మీరే ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చుకోవాలని ఆటగాళ్లకు మొరటుగా సమాధానం ఇస్తుంది.

Advertisement

కానీ ఈ బోర్డు యొక్క లెక్కలో మాత్రం తాము గత ఏడాదిలో ఆటగాళ్లకు కోటి డెబ్భై లక్షలకు పైగా క్రాచు చేశామని.. దాదాపు 50 లక్షలు డేలీ అలవెన్సులు ఇచ్చామని రాసుకుంది. అలాగే ఆటగాళ్లకు అరటిపండ్ల కోసం 30 లక్షలు, వాటర్ బాటిల్స్ కోసం 20 లక్షలు ఖర్చు చేసాం అని తెలుపుతుంది. కానీ ఇందులో రాసిన దానిలో ఇక్క రూపాయి కూడా ఆటగాళ్లకు చేరడం లేదు. మొత్తం బోర్డు అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు అని తెలుస్తుంది. కానీ ఈ విషయంలో మాత్రం బీసీసీఐ ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు. అందువల్ల ఆటగాళ్లు నష్టపోతున్నారు.

ఇవి కూడా చదవండి :

డబ్బు ఎవరినైనా మార్చేస్తుంది అంటున్న తిలక్ వర్మ..!

నేను ఆడితే భారత్ ప్రపంచ కప్ గెలిచేది కాదు..!

Visitors Are Also Reading