టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య గతేడాది డిసెంబర్ లో విడాకులను ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లికి ముందు ఏం మాయ చేసావే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా సమయంలోనే చైతూకు సమంత అంటే ఇష్టం ఏర్పడింది కానీ ఆ విషయం సమంతకు చెప్పలేదు. ఆ తరవాత చాలా ఏళ్లకు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తరవాత కొంతకాలం డేటింగ్ లో ఉన్నారు. ఇక ఇద్దరూ డేటింగ్ లో ఉన్నవార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి.
Also Read: మహేష్ నమ్రతల పెళ్లి కోసం ఇందిరా దేవి అంత కష్టపడ్డారా…? కృష్ణ నో చెప్పడం తో ఆమె ఏం చేశారంటే..?
Advertisement
అంతే కాకుండా సోషల్ మీడియా ద్వారా సమంత తన ప్రేమ గురించి హింట్స్ ఇస్తూ ఉండేది. అలా ఒకరోజు తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన ఈ జంట బంధువులు కుటుంబ సభ్యుల మధ్యన గోవాలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. పెళ్లి తరవాత చాలా అన్యోన్యంగా గడిపారు. అంతే కాకుండా పెళ్లి తరవాత కలిసి సినిమాల్లో మరియు టీవీ యాడ్స్ లోనూ నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మజిలీ సినిమా మంచి విజయం సాధించింది.
Also Read: ఎన్టీఆర్, కృష్ణ శత్రువులుగా మారడం వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందా..?
Advertisement
ఇంతలో ఏం జరిగిందో కానీ ఇద్దరి మధ్యన మనస్పర్దలు వచ్చాయి. దాంతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉండగా నాగార్జున మేనకోడలు సుప్రియ శాపం వల్లే నాగచైతన్య సమంతలు విడిపోవాల్సి వచ్చిందంటూ ఓ వార్త నెట్టింట చెక్కర్లు కొడుతోంది. నాగార్జున మేనకోడలు సుప్రియ హీరో అడవిశేషు ప్రేమలో ఉన్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ సన్నిహితంగా ఉండటం వల్ల ఆ వార్తలు వచ్చాయి.
అంతే కాకుండా వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. కాగా సుప్రియతో అడవిశేషు పెళ్లి సమంత వల్లనే క్యాన్సిల్ అయ్యిందనే వార్త కూడా ఉంది. ఈ నేపథ్యంలో సుప్రియకు సమంత అంటే కోపం వచ్చిందట. దాంతో సుప్రియ శాపం వల్లే చైతూ సమంతలు విడిపోయారా అంటూ అప్పట్లో వార్తలు చెక్కర్లు కొట్టాయి. ఇక సుప్రియ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అక్కడమ్మాయ్ ఇక్కడబ్బాయ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
Also Read: బాలీవుడ్ స్టార్స్ తో కార్తికేయ 2 డైరెక్టర్..!