Home » బాలీవుడ్ స్టార్స్ తో కార్తికేయ 2 డైరెక్టర్..!

బాలీవుడ్ స్టార్స్ తో కార్తికేయ 2 డైరెక్టర్..!

by Azhar
Ad

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో మన తెలుగు సినిమాల హావ అనేది నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 13న ఎటువంటి అంచనాలు అనేవి లేకుండా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా హిందీలో విడుదల అయ్యింది. అసలు ప్రమోషన్స్ కూడా లేకుండానే వచ్చిన ఈ సినిమాకు హిందీలో జనాలు ఆదరణ అనేది ఎక్కువగానే చూపించారు.

Advertisement

అందువల్ల ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. మొత్తంగా 120 కోట్ల కంటే ఎక్కువనే వసూల్ చేసింది. ఇలా చిన్న తెలుగు సినిమాలు కూడా హిందీలో హల్ చల్ చేస్తుంటే.. అక్కడి హీరోల నుండి వస్తున్న సినిమాలు మాత్రం పెద్దగా ఆడటం లేదు. అందుకే హిందీ హీరోలు అందరూ తెలుగు.. సౌత్ డైరెక్టర్ల పైన దృష్టి పెట్టారు. ఇదే సమయంలో బాలీవుడ్ లోని ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి ఓ సినిమా అనేది ప్లాన్ చేస్తున్నాడట కార్తికేయ 2 డైరెక్టర్ చందూ మొండేటి.

Advertisement

కార్తికేయ 2 విడుదల కంటే ముందే ఓ పాన్ ఇండియా కథను సిద్ధం చేసుకున్న చందూ మొండేటి.. దానిని బాలీవుడ్ లోనే స్టార్ హీరోలు అయిన హృతిక్ రోషన్, రణ్‌బీర్‌ కపూర్ లతో కలిపి చేయాలని అనుకున్నట్లు సమాచారం. కానీ ఇప్పటివరకు చందూ మొండేటి వారిలో ఎవరికీ కథ అనేది చెప్పలేదు అని తెలుస్తుంది. చూడాలి మరి ఆయన అనుకుంటున్నా ఈ కాంబోలో సినిమా వస్తుందా.. లేదా అనేది.

ఇవి కూడా చదవండి :

ఆస్ట్రేలియాలో మళ్ళీ ఆ సెంటిమెంట్ పని చేసేనా..?

ముంబై జట్టులో ఉంటె సూర్య కెరియర్ నాశనం..!

Visitors Are Also Reading