Home » “రాధేశ్యామ్” నెగిటివ్ టాక్ కు 10 కార‌ణాలు ఇవే..!

“రాధేశ్యామ్” నెగిటివ్ టాక్ కు 10 కార‌ణాలు ఇవే..!

by AJAY
Ad

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాకు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జిల్ సినిమాతో రాధాకృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించ‌క‌పోయిన‌ప్ప‌టికీ ప్ర‌భాస్ కు క‌థ న‌చ్చ‌డంతో రాధేశ్యామ్ కు ఓకే చెప్పారు. ఇక పిరియాడిక‌ల్ ప్రేమ క‌థ‌….పామిస్ట్రీ ఆధారంగా రాధేశ్యామ్ సినిమా తెర‌కెక్కింది. ఇక ఎన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమాకు మిశ్ర‌మ‌స్పంద‌న వ‌స్తోంది.

Advertisement

అయితే సినిమాకు నెగిటివ్ టాక్ రావ‌డానికి కొన్ని కార‌ణాలు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం…ప్ర‌భాస్ సినిమా అంటే ముందుగా ఫ్యాన్స్ మాస్ సీన్ల‌ను ఆశిస్తుంటారు. కానీ రాధేశ్యామ్ లో మాస్ సీన్లు ఒక్క‌టి కూడా క‌నిపించ‌వు. సినిమా ప్రేమ క‌థా చిత్రం అయిన‌ప్ప‌టికీ భావోద్వేగానికి గురి చేసే సీన్లు కూడా పెద్ద‌గా క‌నిపించ‌క‌పోవ‌డం. ఇక ముఖ్యంగా ప్ర‌భాస్ పాన్ ఇండియా సినిమా అనేగానే ప్రేక్ష‌కులు భారీ అంచ‌నాల‌తో థియేట‌ర్లకు వెళుతున్నారు.

Advertisement

radhe shyam

radhe shyam

కానీ ఆ అంచ‌నాల‌కు రీచ్ అవ్వ‌క‌పోవ‌డం కూడా ఒక కార‌ణం. సినిమా విజువ‌ల్ వండ‌ర్ అయిన‌ప్ప‌టికీ క‌థ‌నం స‌రిగ్గా లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కులు నిరాశ చెందుతున్నారు. ఇది కూడా నెగిటివ్ టాక్ రావ‌డానికి కార‌ణం అవుతోంది. మ‌రోవైపు ఎంచుకున్న కాన్స్పెట్ కొత్త‌ది అయినా ప్రేమ‌క‌థ అంతా పాత‌దే అనే ఫీలింగ్ రావ‌డం కూడా సినిమా నెగిటివ్ టాక్ కు కార‌ణం అవుతోంది.

radhe shyam

radhe shyam

క‌థ‌ను సాగ‌దీసిన‌ట్టు అనిపించ‌డంతో ప్రేక్ష‌కులు బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు. మ‌రోవైపు కొన్ని సీన్లు లాజిక్ లేకుండా ఉండ‌టంతో కూడా ప్రేక్ష‌కులు నిరాశ చెందుతున్నారు. అయితే ఇది కొంత‌మంది అభిప్రాయం మాత్రమే ఒక్కొక్కిరి ఒక్కో ర‌క‌మైన అభిప్రాయాలు ఏర్పడ‌తాయి. కాబట్టి సినిమా చూడాల‌నుకుంటే త‌ప్ప‌కుండా వెళ్లి చూడ‌టం బెట‌ర్.

Also Read: RADHESHYAM REVIEW : ప్ర‌భాస్ “రాధేశ్యామ్” రివ్యూ అండ్ రేటింగ్….!

Visitors Are Also Reading