Home » ఆ సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్ పోస్ట్ పోన్ అవడానికి అసలు కారణం ఏంటో తెలుసా?

ఆ సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్ పోస్ట్ పోన్ అవడానికి అసలు కారణం ఏంటో తెలుసా?

by Srilakshmi Bharathi
Ad

ప్రస్తుతం టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల హడావిడి నడుస్తున్న సంగతి తెలిసిందే. పండగ రోజులు దగ్గర పడుతున్న క్రమంలో సినీ అభిమానులు కూడా తమ ఫేవరెట్ హీరో సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం సినిమా కూడా సంక్రాంతికి విడుదల అవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేసారు. జనవరి ఆరున ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసారు.

Advertisement

అయితే.. ఆరోజు ఫంక్షన్ జరపడానికి పర్మిషన్ రాకపోవడంతో ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ ను పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తోంది. ఈ ఫంక్షన్ ఆరున కాకుండా.. ఏడున ప్లాన్ చేయాలనీ అనుకుంటున్నారు. లేదా ఎనిమిదవ తారీకు అయినా ప్లాన్ చేయాలనుకున్నారు. కానీ, ఎనిమిదవ తారీకు సోమవారం అవడం, ఆరోజు హాలిడే కాకపోవడంతో.. పెద్దగా బజ్ ఉండదు అన్న ఉద్దేశ్యంతోనే ఏడవతేదీ చేయాలనీ అనుకున్నారు. ఇది ఇలా ఉంటె.. గుంటూరు కారం సినిమా ఆరవ తారీకు ప్రి రిలీజ్ ఈవెంట్ పెడతాం అని ప్లాన్ చేసారు కాబట్టి.. హనుమాన్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఏడవ తారీకు చేస్తున్నట్లుగా అనౌన్స్ చేసారు. ఈ ఈవెంట్ కు చిరంజీవి గెస్ట్ గా వస్తున్నారని కూడా అన్నౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ క్రమంలో ఈ రెండు ఈవెంట్స్ ఒకే రోజు జరుగుతాయా అని అందరు అనుకుంటున్నారు. మరో వైపు వెంకీ మామ హీరోగా నటిస్తున్న సైంధవ్ సినిమాకు కూడా ఇదే రోజు ప్రి రిలీజ్ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూడు సినిమాల ఈవెంట్స్ ఒకే రోజు చేస్తే వచ్చే ప్రాబ్లెమ్ వీటిని టెలికాస్ట్ చేయడం. ఒకేసారి టెలికాస్ట్ చేయడం టివి ఛానెల్స్ కి కష్టం అవుతుంది. యూట్యూబ్ లో లైవ్ ఇచ్చినా అందరు మూడు ఈవెంట్స్ ని ఒకేసారి చూడలేరు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading