మహేష్ బాబు కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. కానీ అంచనాలను ఈ సినిమా రీచ్ కాలేకపోయింది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రభాస్ శీను ల కామెడీ ఆకట్టుకుంది. కామెడీ తో పాటు యాక్షన్, రొమాంటిక్ సన్నివేశాలతో కలిపి పక్కా కమర్షియల్ సినిమాగా సర్కారు వారి పాట ప్రేక్షకుల ముందుకు వచ్చినా కమర్షియల్ హిట్ టాక్ ను సొంతం చేసుకోలేదు.
కానీ కలెక్షన్ల పరంగా బాగానే వసూలు చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన సుబ్బరాజు ఫోన్ కు లా లా భీమ్లా అనే భీమ్లా నాయక్ సినిమా రింగ్ టోన్ వస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఫోన్ చేసినప్పుడు సుబ్బరాజు ఫోన్ కు ఈ రింగ్ టోన్ వినిపిస్తుంది. నిజానికి స్టార్ హీరోల సినిమాలలో మరో హీరో రిఫరెన్స్ ఉండదు.
Advertisement
Advertisement
కానీ సర్కారు వారి పాటలో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ పెట్టుకోవడం ఆశ్చర్యకరం. అంతేకాకుండా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ లో నంబర్ వన్ స్థానాల్లో హీరోలు అలాంటప్పుడు మహేష్ బాబు సినిమాలో పవన్ కళ్యాణ్ రింగ్టోన్ వినిపించడం గ్రేట్… అయితే పవన్ కళ్యాణ్ రింగ్ టోన్ ఈ సినిమా లో పెట్టడానికి కొన్ని కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ రెండు సినిమాలకు సంగీత దర్శకుడు తమన్ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భీమ్లా నాయక్ సినిమా రింగ్ టోన్ వాడుకున్నారని తెలుస్తోంది. అదేవిధంగా సర్కారు వారి పాట నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ తో భవదియుడు భగత్ సింగ్ అనే సినిమా చేస్తోంది. దాంతో ఆ సినిమాకు కూడా పబ్లిసిటీ జరిగినట్టు ఉంటుందని పవన్ పాటను తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Also read :
భార్యలు భర్తలను ఎందుకు పేరు పెట్టి పిలవకూడదు… అలా పిలిస్తే ఏం జరుగుతుంది…!