ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరో నాగశౌర్య. మొదటి సినిమాతోనే నాగశౌర్య టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో లవర్ బాయ్ లుక్ లో కనిపించి అమ్మాయిల ఫేవరెట్ గా మారిపోయాడు. ఆ తరవాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా మారిపోయాడు.
Advertisement
హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వెనక్కి చూడకుండా నాగశౌర్య సినిమాలు చేస్తున్నాడు. కానీ నాగశౌర్యకు మంచి పేరు తెచ్చిన సినిమాలు ఒకటి ఊహలు గుసగుసలాడే అయితే మరొకటి ఛలో సినిమా….ఈ రెండు సినిమాలు మినహా మరో చెప్పుకోదగ్గ సినిమా లేదనే చెప్పాలి. ఇక రీసెంట్ గా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన లక్ష్య, వరుడు కావలెను సినిమాలు కూడా డిజాస్టర్ లుగా నిలిచాయి.
Advertisement
దాంతో నాగశౌర్య హిట్ కోసం సతమతం అవుతున్నాడు. అయితే చందమామ కథలు సినిమా టైమ్ నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు నాగశౌర్య బంధువులు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ సతీమణికి హీరో నాగశౌర్య కజిన్ బ్రదర్ అవుతారంటూ వార్తలు వినిపించాయి. చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు ఈ వార్తలు నిజమేనని అనుకున్నారు.
నాగశౌర్య అభిమానులు కూడా ఈ వార్తలు విని సంతోష పడ్డారు. అయితే ఓ ఇంటర్వ్యూలో ఆ వార్తలపై నాగశౌర్య తల్లి ఉషారాణి క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ తో తమకు ఎలాంటి సంబంధం లేదని కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని చెప్పారు. కానీ నాగశౌర్య క్లోజ్ ఫ్రెండ్ ఒకరు ఎన్టీఆర్ సతీమణికి కజిన్ బ్రదర్ అవుతారని చెప్పారు. అలా ఎన్టీఆర్ నాగశౌర్య బంధువులు అని వార్తలు వచ్చి ఉండొచ్చంటూ ఉషారాణి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి : పుష్ప : ద రూల్లో కూడా సమంత ఐటమ్ సాంగ్..!