Telugu News » Blog » బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు..? రిపోర్ట‌ర్ ప్ర‌శ్న‌కు మైండ్ బ్లాక్ అయ్యే రిప్లై ఇచ్చిన మ‌హేశ్ బాబు..!

బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు..? రిపోర్ట‌ర్ ప్ర‌శ్న‌కు మైండ్ బ్లాక్ అయ్యే రిప్లై ఇచ్చిన మ‌హేశ్ బాబు..!

by AJAY
Ads

ప్ర‌స్తుతం దేశంలో ఎక్క‌డ చూసినా తెలుగు సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. తెలుగు సినిమా హీరోయిన్ ల‌తో చేయాల‌ని బాలీవుడ్ భామ‌లు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. చాలా మంది తెలుగు ద‌ర్శ‌కులు బాలీవుడ్ స్టార్ ల‌తో సినిమాలు చేస్తున్నారు. అంతే కాకుండా బాలీవుడ్ ద‌ర్శ‌కులు తెలుగు హీరోల‌తో సినిమాలు చేస్తున్నారు. ఈ క్రెడిట్ మొత్తం రాజ‌మౌళిదే అని చెప్పాలి. బాహుబ‌లి సినిమాతో జ‌క్క‌న్న సినిమాల‌ను పాన్ ఇండియా సినిమాలుగా మార్చారు.

దాంతో తెలుగు త‌మిళ క‌న్న‌డ సినిమాలు పాన్ ఇండియా లెవ‌ల్ విడుద‌ల అవుతున్నాయి. ఒక‌ప్పుడు బాలీవుడ్ సినిమాల‌కే ఇత‌ర ఇండ‌స్ట్రీ సినిమాల కంటే ఎక్కువ మార్కెట్ ఉండేది కానీ ఇప్ప‌డు తెలుగు సినిమాలు పాన్ ఇండియాలో విడుద‌ల‌వుతూ బాలీవుడ్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టేస్తున్నాయి. ఇక తెలుగు సినిమాకు ఇంత‌టి క్రేజ్ వ‌చ్చి అంద‌రూ తెలుగు సినిమా వైపు చూస్తుంటే ఓ మీడియా ప్ర‌తినిధి మ‌హేశ్ బాబుకు ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌వేశారు.

మ‌హేశ్ బాబు క్వికాన్ పేమెంట్స్ యాప్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న యాప్ ను లాంఛ్ చేశారు. ఇక ఈ కార్య‌క్ర‌మంలో…. మీరు హిందీలో ఎప్పుడు సినిమా చేస్తారంటూ రిపోర్టర్ ప్ర‌శ్నించారు. దానికి మ‌హేశ్ బాబు కాస్త సీరియ‌స్ అయిన‌ట్టు క‌నిపించింది.

Mahesh babu

Mahesh babu

హిందీ చిత్రాలు చేయాల్సిన అవ‌స‌రం ఏముంది..? ఇప్పుడు తెలుగు సినిమాల‌ను ప్ర‌పంచం అంతా చూస్తున్నారు. ఇప్పుడు జ‌రుగుతుంది అదే..అలాంట‌ప్పుడు నువ్వైనా తెలుగు సినిమాలు చేస్తే చాల‌నుకుంటావ్..అంటూ స‌మాధానం ఇచ్చాడు. దాంతో సూప‌ర్ అన్స‌ర్ అంటూ అక్క‌డ ఉన్న‌వారు మ‌హేశ్ బాబును మెచ్చుకున్నారు. ఇక మ‌హేశ్ బాబు కామెంట్స్ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతుండ‌టంతో టాలీవుడ్ అభిమానులు నిజ‌మే క‌దా అంటూ స‌పోర్ట్ చేస్తున్నారు.


You may also like