ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్ లు ఇప్పుడు రసవత్తరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ జరిగిన మొదటి మ్యాచ్ లో ఆర్సీబీ-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. వరుసగా రెండు ఓటములతో డీలా పడిన ఆర్సీబీ ఇవాళ గెలుపు బాటపట్టింది. సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగలిింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులకే పరిమితమైంది.
Also Read : ఇండియన్ క్రికెటర్స్ వారి అందమైన భార్యలు!
Advertisement
ఐపీఎల్ 16వ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పేలవ ప్రదర్శనను కనబరుస్తోంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ తరుపున ఫస్ట్ మ్యాచ్ ఆడిన విజయ్ కుమార్ వైశాఖ్ బంతితో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్ లో ఢిల్లీకి ఇది ఐదో ఓటమి. ఢిల్లీ బ్యాటర్లలో మనీష్ పాండే (50 : 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)తో రాణించాడు. అక్షర్ పటేల్ (21), డేవిడ్ వార్నర్ (19), అమాన్ ఖాన్ (18) పరుగులు చేశారు. చివరిలో నోకియా 23 పరుగులు సాధించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఢిల్లీ ఓటమి ఖరారు అయింది. బెంగళూరు బౌలర్లలో ఆరంగేట్ర ఆటగాడు విజయ్ కుమార్ వైశాఖ్ (3/20) పరుగులతో ఆకట్టుకున్నాడు. సిరాజ్ 2, పార్నెల్, హసరంగ, హర్షల్ పటేల్ ఒక్కో వికెట్ సాధించారు.
Advertisement
బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 34 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. డు ప్లెసిస్ 16 బంతుల్లో 22 పరుగులు, మహిపాల్ లామ్రోర్ 18 బంతుల్లో 26, గ్లెన్ మ్యాక్స్ వెల్ 14 బంతుల్లో 24 పరుగులు చేశాడు. మ్యాక్స్ వెల్ దూకుడుతో ఆడినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు. నోకియా, లలిత్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలవగా.. ఢిల్లీ అట్టడుగు స్థానంలో నిలిచింది.